నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం అఖండ 2: తాండవం. ఇది 2021లో వచ్చిన హిట్ సినిమా అఖండకు సీక్వెల్‌గా తెరకెక్కింది. దైవభక్తిపై ఆధారపడి తీసిన ఈ మూవీ డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాకపోతే సినిమాలో కొన్ని సీన్లు లాజిక్‌తో సంబంధం లేకుండా మరీ ఓవర్‌గా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అఖండ 2లో శివుడు
అయినా బాలయ్య డైలాగులు, యాక్షన్ 'అతి' లేకుండా ఉండవని అందరికీ తెలిసిందే! అయితే సినిమాలో శివుడి పాత్ర మాత్రం బాగుందంటున్నారు. అఖండ తల్లి మరణించినప్పుడు కైలాసంలోని శివుడు భువిపైకి వచ్చి ఆమె చితికి అగ్ని సంస్కారం చేస్తాడు. ఈ సన్నివేశాన్ని బోయపాటి ఎంతో భక్తిభావంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ ముఖ్యమైన సీన్‌లో శివయ్యగా మెప్పించిన ఆ నటుడెవరు? అని నెట్టింట జనం ఆరా తీస్తున్నారు.
హిందీ సీరియల్స్‌లో ఫేమస్
అతడు మరెవరో కాదు హిందదీ బుల్లితెర నటుడు తరుణ్ ఖన్నా. 2015లో ప్రసారమైన సంతోషి మా సీరియల్‌లో తొలిసారి మహాశివుడిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాధాకృష్ణ, రామ్ సియాకె లవ్‌కుశ, నమః, దేవి ఆది పరాశక్తి, శ్రీమద్ రామాయణ్, వీర్ హనుమాన్: బోలో బజ్‌రంగ్ బలీకీ జై, కాల భైరవ్ రక్ష శక్తిపీఠ్ కే వంటి పలు సీరియల్స్‌లో ఈశ్వరుడిగా వేషం కట్టి మెప్పించాడు.
పర్ఫెక్ట్!
అందుకే ఈ పాత్రకు తనైతే పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాడని భావించినట్లు తెలుస్తోంది. దర్శకుడి అంచనా నిజమైంది. తరుణ్ ఖన్నా తెరపై అడుగుపెట్టిన ప్రతి సీన్ వెండితెరపై బాగా పేలిందని టాక్ వినిపిస్తోంది. తరుణ్ ఖన్నా (Tarun Khanna).. చంద్రగుప్త మౌర్య సీరియల్‌లో చాణక్య పాత్ర పోషించాడు.
చదవండి: 25 ఏళ్లుగా డిన్నర్‌కే వెళ్లలేదంటున్న బాలీవుడ్ స్టార్


