25 ఏళ్లుగా డిన్నర్‌కే వెళ్లలేదంటున్న స్టార్‌ హీరో! | Salman Khan says he has not gone out for dinner in past 25 years | Sakshi
Sakshi News home page

Salman Khan: షూటింగ్స్‌తోనే ఫుల్‌ బిజీ! ఇంకా బయట డిన్నర్‌ ఎక్కడిది?

Dec 13 2025 11:20 AM | Updated on Dec 13 2025 11:30 AM

Salman Khan says he has not gone out for dinner in past 25 years

సినిమా తారలకు ఎన్నో ఆంక్షలు ఉంటాయి. కాదు, కాదు వాళ్లే ఆంక్షలు పెట్టుకుని బతుకుతుంటారు. నోరు కట్టేసుకుంటారు, స్వేచ్ఛగా బయటకు వెళ్లలేరు, ఒక్కమాటలో చెప్పాలంటే నచ్చినట్లు జీవించలేరు. ఎంతసేపూ ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీయాలన్న తాపత్రయంలో ఉంటారు. అందుకోసం తమ శరీర సౌష్టవాన్ని నిత్యం కాపాడుకునే ప్రయత్నం చేస్తారు.

25 ఏళ్లుగా
అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం చీటింగ్‌ డే అంటూ కొన్నిసార్లు అన్నీ పక్కనపెట్టి నచ్చింది ఆరగిస్తుంటారు. అది బిర్యానీ అయినా, ఐస్‌క్రీమ్‌ అయినా! కాస్త గ్యాప్‌ దొరికితే వెకేషన్‌కో, డిన్నర్‌కో బయటకు వెళ్తుంటారు. కానీ అలా తాను డిన్నర్‌కు వెళ్లి 25 ఏళ్లు అయిందంటున్నాడు బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌.

వాళ్లే ఉన్నారు
తాజాగా రెడ్‌ సీ ఫిలిం ఫెస్టివల్‌కు హాజరైన సల్మాన్‌ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు. నేనెప్పుడూ కుటుంబం, ఫ్రెండ్స్‌ అంటూ వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాను. కానీ నా జీవితంలో కొందరు క్లోజ్‌ ఫ్రెండ్స్‌ను కోల్పోయాను. దీంతో ఇప్పుడు నాతో నలుగురైదుగురు మాత్రమే ఉన్నారు. వాళ్లు ఎన్నో ఏళ్లకొద్దీ నాతో సావాసం చేస్తున్నారు.

అదే నా పని
నేను బయట డిన్నర్‌కు వెళ్లి 25 ఏళ్లవుతోంది. ఎంతసేపూ షూటింగ్‌, ఎయిర్‌పోర్ట్‌, హోటల్‌, ఈవెంట్‌.. ఆ వెంటనే షూటింగ్‌.. ఇదే నా పని. అలా అని ఈ విషయంలో నేనేమీ బాధపడటం లేదు. ఎందుకంటే ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తుంటారు. వారికోసం నేను కష్టపడుతూనే ఉంటాను అని చెప్పుకొచ్చాడు. 

మర్చిపోయాడా?
అయితే సల్మాన్‌ ఖాన్‌ పలువురు సెలబ్రిటీలతో గతంలో డిన్నర్‌కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. మరి ఆనాటి విషయాల్ని సల్మాన్‌ మర్చిపోయాడా? లేదంటే అప్పుడు తినకుండానే బయటకు వచ్చేశాడా? అన్నది తనకే తెలియాలి! ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan).. బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌ సినిమా చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement