భర్తతో గొడవ.. నిద్రమాత్రలు మింగిన బుల్లితెర నటి | Kollywood TV Serial Actress Rajeshwari Ends Her Life After Dispute With Her Husband | Sakshi
Sakshi News home page

బుల్లితె నటి రాజేశ్వరి ఆత్మహత్య

Dec 13 2025 6:58 AM | Updated on Dec 13 2025 11:11 AM

TV Actress Rajeshwari Commits Self Eviction

బుల్లితెర నటి రాజేశ్వరి (39) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. స్థానిక సైదాపేటకు చెందిన రాజేశ్వరి ప్రస్తుతం ఒక టీవీ ఛానల్‌లో ప్రసారం అవుతున్న సిరకడిక్క ఆశై సీరియల్‌లో తల్లి పాత్రలో నటిస్తున్నారు. అంతకుముందు భాగ్యలక్ష్మి, పనివిళుమ్‌ మలర్‌వనమ్‌.. ఇతర సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు పొందారు. అదే విధంగా సినిమాల్లోనూ చిన్న పాత్రలు పోషించారు.

నిద్రమాత్రలు మింగి 
పెళ్లయిన తర్వాత భర్తతో కలిసి స్థానిక ముత్తియల్‌పేటలో నివసిస్తూ వచ్చారు. అయితే ఈమెకు, భర్తకు మధ్య చాలాకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. దీంతో రాజేశ్వరి ఇటీవల సైదాపేటలోని తన తల్లి ఇంటికి వచ్చి అక్కడి నుంచే షూటింగ్‌లకు వెళ్తుండేవారు. ఇటీవల భర్తతో మరోసారి గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన నటి గురువారం రాత్రి అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకుని స్పృహ కోల్పోయారు. 

చికిత్స పొందుతూ మృతి
తొలుత ఆమెను వెంటనే సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి స్థానిక కీల్‌పాక్కమ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే సైదాపేట పోలీసులు కీల్‌పాక్కమ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

గమనిక:
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
 

Advertisement
 
Advertisement
Advertisement