ఉంగరం పెట్టుకుంటే స్టార్ అయిపోతానన్నారు | Actor Naveen Chandra About Sentiments | Sakshi
Sakshi News home page

Naveen Chandra: అది జేబులో పెట్టుకుని తిరగమన్నారు

Feb 1 2026 9:04 PM | Updated on Feb 1 2026 9:04 PM

Actor Naveen Chandra About Sentiments


టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర కెరీర్ చాలా డిఫరెంట్. ఎందుకంటే 'అందాల రాక్షసి' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ తర్వాత హీరోగా చేసిన మూవీస్ ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. దీంతో 'అరవింద సమేత' చిత్రంతో విలన్‌గానూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే తనకు సరైన గుర్తింపు రాక ఇబ్బంది పడుతున్న టైంలో చాలామంది తనకు మూఢనమ్మకాల గురించి చాలా చెప్పి చూశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

(ఇదీ చదవండి: గుండె లోతుల్లో బాధ.. ఎలా చెప్పాలో తెలీదు: నిహారిక)

నేను కూడా సరైన ఛాన్సులు రాక ఇబ్బంది పడుతున్నప్పుడు ఇండస్ట్రీలోని వ్యక్తులు చాలా చెప్పారు. ఇన్నేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నావ్. ఈ ఉంగరం వేసుకుంటే స్టార్ అయిపోతావ్ అని అన్నారు. రాగి రేకుపై ఏదో రాసిచ్చి, అది జేబులో పెట్టుకుని తిరిగితే.. నీతో మాట్లాడిన దర్శకనిర్మాతలు వెంటనే అవకాశాలు ఇచ్చేస్తారని కూడా అన్నారు. కానీ నేను అవేవి నమ్మలేదు. కేవలం మీ(అభిమానుల) అభిమానం వల్లే ఇలా ఉన్నాను అని నవీన్ చంద్ర చెప్పుకొచ్చాడు.

ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'హనీ'. మూఢ నమ్మకాలు, చేతబడులు, బలులు తదితర అంశాలతో తీసిన సినిమా ఇది. దివ్య పిళ్లై హీరోయిన్ కాగా కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఆదివారం హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగానే నవీన్ చంద్ర తన జీవితంలో జరిగిన తనతో చాలామంది ఇప్పటికీ చెప్పిన మూఢనమ్మకాల గురించి బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: ఆ పిల్లి ఉంటే అందరూ దాసోహమే.. 'హనీ' ట్రైలర్ రిలీజ్)

Advertisement
 
Advertisement
Advertisement