2026లో ‘మెగా’ బ్లాస్ట్‌.. నలుగురు హీరోలు.. ఐదు సినిమాలు! | Chiranjeevi To Pawan Kalyan List Of Mega Heroes Movie Released In 2026 | Sakshi
Sakshi News home page

2026లో ‘మెగా’ బ్లాస్ట్‌.. నలుగురు హీరోలు.. ఐదు సినిమాలు!

Dec 13 2025 12:26 PM | Updated on Dec 13 2025 12:58 PM

Chiranjeevi To Pawan Kalyan List Of Mega Heroes Movie Released In 2026

ఈ ఏడాది మెగా అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. ఓజీ మినహా.. మెగా హీరోల సినిమాలేవి బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటలేకపోయాయి. మరోవైపు చిరంజీవి నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.  హిట్‌,ఫ్లాప్‌ పక్కన పెడితే..కనీసం సినిమా వచ్చినా చాలు అని మెగా ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులకు వచ్చే ఏడాది ప్రారంభంలో ఫలితం దక్కనుంది. రెండు నెలల గ్యాపులోనే ఒకరు కాదు ఇద్దరు కాదు..ఏకంగా నలుగు మెగా హీరోల సినిమాలు రిలీజ్‌ కానుంది. 

వచ్చే ఏడాది సంకాంత్రికి మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) ‘మనశంకర వరప్రసాద్‌ గారు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్‌ రావిపూడి దర్వకత్వం వహించిన ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్‌ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో మెగాస్టార్‌ని ఏకంగా రూ. 500 కోట్ల క్లబ్‌లో చేర్చాలని భావిస్తున్నారు. వెంకటేశ్‌తో అనిల్‌ తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై రూ. 300 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టిన సంగతి తెలిసిందే. మెగాస్టార్‌ సినిమాకు హిట్‌ టాక్‌ వస్తే.. రూ. 500 కోట్ల కలెక్షన్స్‌ పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.

ఇక మార్చిలో రామ్‌ చరణ్‌ ‘పెద్ది’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హిట్‌ పక్కకు పెడితే.. చరణ్‌(Ram charan) ఈ సినిమాతో రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరతాడా లేదా అనేదానిపై మెగా ఫ్యాన్స్‌ డిబెట్‌ జరుపుతున్నారు. మార్చి 27న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. అయితే ఈ సినిమా కంటే ముందుగానే మరో మెగా హీరో సాయిదుర్గ తేజ్‌ ‘సంబరాల ఏటిగట్టు’ రిలీజ్‌ కానుంది. డేట్‌ ఫిక్స్‌ కాలేదు కానీ.. మార్చి రెండో వారంలో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

ఇక ఏప్రిల్‌లో మెగాబ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయబోతున్నారు. ఈ నెలలోనే చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్‌ కానుంది. వాస్తవానికి ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్‌ కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. సమ్మర్‌లో రాబోతున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. మార్చిలోపు సీజీ పనులన్నీ పూర్తి చేసుకొని ఏప్రిల్‌లో రిలీజ్‌ చేయలని ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ఇదే నెలలో పవన్‌ కల్యాణ్‌ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ’కూడా రిలీజ్‌ కాబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తుంది. ఇప్పటికే పవన్‌ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ అంతా పూర్తి అయింది. మార్చికల్లా అన్ని పనులు పూర్తి చేసుకొని..ఏప్రిల్‌లోనే రిలీజ్‌ చేయాలని హరీశ్‌ శంకర్‌ ప్లాన్‌ చేస్తున్నాడట. ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2026 ప్రారంభం నుంచే మెగా ఫ్యాన్స్‌ సెలెబ్రేషన్స్‌  ప్రారంభం అవుతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement