breaking news
Akhanda 2 Movie
-
సూపర్ సెప్టెంబర్
సెప్టెంబర్ నెల సినిమా లవర్స్‌కి సూపర్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రతి నెలా విడుదలవుతాయి కానీ పెద్ద సినిమాలు రెండో మూడో ఉంటాయి. అయితే సెప్టెంబర్‌లో విడుదలయ్యేవాటిలో పెద్ద సినిమాల సంఖ్య మెండుగానే ఉంది. ఆ సినిమాల గురించి తెలుసుకుందాం.యాక్షన్ డ్రామా... ‘అరుంధతి, పంచాక్షరి, భాగమతి, నిశ్శబ్దం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల తర్వాత అనుష్క లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఘాటీ’. ‘వేదం’ (2010) వంటి హిట్ మూవీ తర్వాత అనుష్క, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో రూపొందిన ద్వితీయ చిత్రమిది. విక్రమ్ ప్రభు, జగపతిబాబు, చైతన్యా రావు, రవీంద్రన్ విజయ్ ఇతర పాత్రలుపోషించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు.పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘ఘాటీ’. ఒక బలహీన మహిళ క్రిమినల్‌గా, ఆ తర్వాత లెజెండ్‌గా మారే పాత్రలో అనుష్క నటన అద్భుతంగా ఉంటుంది. అధిక బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో మా సినిమా రూపొందింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ మా మూవీపై అంచనాలు పెంచింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. సూపర్ యోధ... ‘హనుమాన్’ (2024) చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్న తేజ సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రితికా నాయక్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషించారు. జగపతిబాబు, శ్రియ శరణ్, జయరామ్ ఇతర పాత్రలుపోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 2డీ, 3డీ ఫార్మాట్లలో 8 భాషల్లో విడుదల కానుంది.ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో తేజ సూపర్ యోధగా కనిపించనున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైనపోస్టర్స్, వీడియో గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. గౌర హరి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ‘వైబ్ ఉంది బేబీ..’ పాట ట్రెండింగ్‌గా మారింది. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ పై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా హిందీ థియేట్రికల్ హక్కులను కరణ్ జోహార్ దక్కించుకున్నారు.అందమైన ప్రేమకథ ఓ వైపు హీరోయిన్గా బిజీ బిజీగా వరుస ప్రాజెక్టులతో దూసుకెళుతూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలకీ సై అంటున్నారు రష్మికా మందన్న. ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి లీడ్ రోల్లో నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ‘‘అందమైన ప్రేమకథగా ఈ చిత్రం రూపొందింది.మనసుని ఆకట్టుకునే అంశాలతో రాహుల్ రవీంద్రన్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో రష్మిక నటన సరికొత్తగా ఉంటుంది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మా మూవీ ఉంటుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను హీరో విజయ్ దేవరకొండ తన వాయిస్ ఓవర్‌తో రిలీజ్ చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘నదివే...’ అంటూ సాగే తొలి పాట కూడా ఆకట్టుకుంది.కిష్కిందపురిలో... ‘భైరవం’ సినిమాతో ఇటీవల ప్రేక్షకులను అలరించారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆయన నటించిన తాజా చిత్రం ‘కిష్కిందపురి’. ‘రాక్షసుడు’ (2019) వంటి హిట్ మూవీ తర్వాత సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన ద్వితీయ చిత్రమిది. కౌశిక్ పెగల్లపాటి రచన, దర్శకత్వంలో అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాని సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ‘‘హారర్ మిస్టరీగా రూపొందిన చిత్రం ‘కిష్కిందపురి’.సాయి శ్రీనివాస్ కెరీర్లో హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ఇది. ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన హారర్, మిస్టరీ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. కౌశిక్ పెగల్లపాటి గ్రిప్పింగ్ కథనం, చిన్మయ్ సలాస్కర్ కెమెరా వర్క్, సామ్ సీఎస్ సంగీతం ఆకట్టుకుంటాయి. సాహు గారపాటి గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చుతుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రం నుంచి ‘ఉండి పోవే నాతోనే...’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది. యాక్షన్ భద్రకాళి సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు... ఇలా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు విజయ్ ఆంటోని. ఆయన నటించిన 25వ చిత్రం ‘భద్రకాళి’. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ ఇతర పాత్రలుపోషించారు. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్‌పై విజయ్ ఆంటోని నిర్మించారు. ఈ సినిమాని తొలుత సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే ఆ తేదీకి కాకుండా 19వ తేదీ రిలీజ్ చేయనున్నట్లు లేటెస్ట్గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడు దల చేస్తోంది. ఈ చిత్రంలో కిట్టు పాత్రలో విజయ్ ఆంటోని నటించారు. సుమారు 200 కోట్ల రూపాయల కుంభకోణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. గత చిత్రాల కంటే స్టైలిష్‌గా, యాక్షన్ హీరోగా కనిపించనున్నారు విజయ్. వెండితెరపై తాండవం... హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనులది హిట్ కాంబినేషన్. వారి కలయికలో వచ్చిన ‘సింహా (2010), లెజెండ్ (2014), అఖండ’ (2021) సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్యాంగ్‌స్టర్ పాత్రలో... పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’. ‘రన్ రాజా రన్, సాహో’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్‌రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలుపోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ‘‘ఓజీ’ చిత్రంలో పవన్ కల్యాణ్ భీకరమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. యాక్షన్ ఫ్యాక్డ్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల యేటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి కథానాయికగా నటిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హనుమాన్’ (2024) వంటి పాన్ ఇండియన్ ఫిల్మ్ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘‘యాక్షన్ ఫ్యాక్డ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల యేటిగట్టు). ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు సాయిదుర్గా తేజ్. ఆయనపోరాట సన్నివేశాలు సరికొత్తగా ఉంటూ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేస్తాయి. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.నవ్వులే నవ్వులు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీ ఫేమ్ శివానీ నగరం, ‘90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్ జంటగా నటించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఎస్ఎస్ కాంచీ, అనిత చౌదరి, సత్య కృష్ణన్ ఇతర పాత్రలుపోషించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రోడక్షన్ బ్యానర్‌పై ఆదిత్య హాసన్ నిర్మించారు.ఈ సినిమాని నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నారు. ‘‘పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సినిమా చూస్తున్నంత సేపు థియేటర్లలో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. 2 గంటల పాటు మా చిత్రం ఆడియన్స్‌కి నవ్వులు పంచుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘రాజా గాడికి...’ అంటూ సాగే పాటని విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా సెప్టెంబరులో విడుదలకు ముస్తాబవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
'ఓజీ'తో అఖండ వార్.. తగ్గేది ఎవరంటే..?
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడనున్నాయి. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న పవన్ కల్యాణ్ (ఓజీ), బాలకృష్ణ (అఖండ 2) విడుదల కానున్నాయి. ఇప్పటికే రెండు సినిమాల నుంచి అధికారికంగా ప్రకటన వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద మొదటిసారి పవన్‌తో బాలయ్య పోటీ పడుతుండటంతో అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ మధ్య మరోసారి బాక్సాఫీస్ లెక్కలపై చర్చ జరగనుంది. దసరా విజేతగా ఎవరు నిలుస్తారో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ పోటీ నుంచి బాలయ్య తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇండస్ట్రీలో బలంగానే వార్తలు వినిపిస్తున్నాయి.రెండు భారీ బడ్జెట్ చిత్రాల మధ్య పోటీ ఎందుకనే 'అఖండ'నే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఆపై అఖండ2 ప్రాజెక్ట్‌తో పాన్ ఇండియా రేంజ్లో విజయం సాధించాలని దర్శకుడు బోయపాటి పక్కా ప్రణాళికతో ఉన్నారు. అందులో భాగంగానే ఈ సినిమా గ్రాఫిక్స్ పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం కేటాయించాలని ఆయన ఆలోచిస్తున్నారట. ఆపై ఇంకా కొంత భాగం షూటింగ్ పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయట. 2021 డిసెంబర్లో అఖండ విడుదలై బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇప్పుడు సీక్వెల్ కూడా డిసెంబర్ నెలలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. అఖండ2 చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా సంయుక్త (Samyuktha) నటిస్తోంది. ఓజీ' సినిమాను రూ. 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా అత్యంత బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాలు ఒకేరోజు విడుదలైతే తప్పకుండా థియేటర్స్ విషయంలో ఇబ్బందులు రావచ్చు. అందుకే ఎవరో ఒకరు తమ సినిమాను వాయిదా వేసుకుని, నిర్మాణ పరంగా మరింత బలంగా తెరకెక్కించి కొత్త తేదీన విడుదల చేయడం బెటర్ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
'అఖండ' కోసం తెలుగులో ఎంట్రీ ఇచ్చేసిన నటి హర్షాలీ మల్హోత్రా (ఫోటోలు)
-
తెలుగులో ఎంట్రీ ఇస్తోన్న భజరంగీ భాయిజాన్ ఫేమ్..!
సల్మాన్ ఖాన్ మూవీ బజరంగీ భాయిజాన్‌లో నటించి అభిమానులను సంపాదించుకున్న నటి హర్షాలీ మల్హోత్రా. ఈ సినిమాలో మున్ని అనే పాత్రలో సినీ ప్రియులను మెప్పించింది. ముంబయికి చెందిన హర్షాలీ బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. హిందీలో పలు సీరియల్స్‌లో తన నటనతో రాణించింది. 2015లో విడుదలైన బజరంగీ భాయిజాన్ మూవీతోనే ఆమెకు గుర్తింపు వచ్చింది.ప్రస్తుతం హర్షాలీ మల్హోత్రా టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న అఖండ సీక్వెల్లో నటిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ చిత్రంలో హర్షాలీ.. జనని పాత్రలో కనిపించనుందని తెలిపారు. ఈ మేరకు హర్షాలీ మల్హోత్రా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.కాగా.. గతంలో బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా అఖండ-2ను తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ మూవీలో సంయుక్త, ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం దసరా ఈ ఏడాది కానుకగా సెప్టెంబరు 25న విడుదల కానుంది. A smile of an angel and a heart of gold ❤️Introducing Bajrangi Bhaijaan fame #HarshaaliMalhotra as 'JANANI' from #Akhanda2 ✨#Akhanda2 THANDAAVAM IN THEATRES DUSSEHRA 25th SEPTEMBER #Akhanda2Thaandavam 'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial… pic.twitter.com/t5M3pVh8c1— 14 Reels Plus (@14ReelsPlus) July 2, 2025 -
అటు బాలయ్య.. ఇటు పవన్.. తగ్గేదెవరు?
టాలీవుడ్‌కి సంక్రాంతి, దసరా, దీపావళి పండగలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో పలు బడా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. పండగ వేళ సెలవులు ఉండడం.. అంతా ఎంజాయ్ చేసే మూడ్‌లో ఉంటారు కాబట్టి.. స్టార్ హీరోల సినిమాలు ఎక్కువ ఈ పండగ సమయాల్లోనే వస్తుంటాయి. అయితే ఒక్కోసారి రెండు మూడు పెద్ద సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. కొన్ని సార్లు అవన్నీ హిట్ అయితే..మరికొన్ని సార్లు వాటిల్లో ఏదో ఒకటి మాత్రమే విజయం సాధిస్తుంది. ఈ పోటీ కారణంగా కొన్ని మంచి చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేకపోతున్నాయి. అందుకే ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్దాలేవి జరగట్లేదు. స్టార్ హీరోలలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతున్నారు. పోటీ ఉన్నా తమకు సినిమాకు ఢోకా లేదు అనుకుంటే తప్ప.. రిలీజ్ చేయట్లేదు. కానీ త్వరలోనే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ యుద్దం జరగబోతుంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వారిలో ఒకరు బాలకృష్ణ(Nandamuri Balakrishna) అయితే మరో స్టార్ హీరో పవన్ కల్యాణ్( Pawan Kalyan). వీరిద్దరు బక్సాఫీస్ వార్కి రెడీ అవుతున్నారు.మరోసారి బాక్సాఫీస్‌పై ‘తాండవం’?బాలకృష్ణ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అఖండ: తాండవం’(Akhanda 2). వీరిద్దరి కాంబినేషన్లో 2021లో వచ్చిన ‘అఖండ’సినిమాకు సీక్వెల్ ఇది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. దాంతో పాటు రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించారు. దసర కానుకగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం రాబోతుందని వెల్లడించారు. మరోవైపు పవన్ కల్యాణ్ ఓజీ సినిమా కూడా అదే రోజు రిలీజ్ కానుంది.‘ఓజీ’ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఓజీ(OG) ఒకటి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియంకా మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. ఇమ్రాన్ హష్మి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు కానీ రిలీజ్ డేట్ మాత్రం చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అదే రోజు బాలయ్య కూడా అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఇద్దరి సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకేసారి రావడం రెండూ సినిమాకు మంచిది కాదని సినీ పండితులు చెబుతున్నారు. కాస్త గ్యాప్ తీసుకొని వస్తే రెండు చిత్రాలకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని, ఒకోసారి వస్తే కొంచెం తేడా అయితే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని అభిప్రాయ పడుతున్నారు. మరి వీరిద్దరిలో ఎవరో ఒకరు తగ్గుతారా? లేదా ‘తగ్గేదే లే’ అంటూ బాక్సాఫీస్ వార్కి సై అంటారా? కొద్ది రోజుల్లో తెలుస్తుంది. -
బాలకృష్ణ 'అఖండ 2' టీజర్ రిలీజ్.. ఈసారి కూడా
బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన 'అఖండ' సూపర్ హిట్. 2021 డిసెంబరులో రిలీజైన ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ తీస్తున్నారు. షూటింగ్ చాలావరకు పూర్తి చేశారు. జూన్ 10న అంటే రేపటి రోజున బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. తొలి భాగానికి ఏ మాత్రం తగ్గకుండా ఈసారి కూడా సినిమాని ప్లాన్ చేస్తున్నారు. టీజర్ చూస్తుంటే ఆ విషయం అర్థమవుతోంది.తొలి భాగంతో పోలిస్తే ఈసారి బాలకృష్ణ లుక్‌లో చిన్నపాటి మార్పులు చేశారు. పొడవాటి జుత్తుతో పాటు పొడుగు గడ్డంతో బాలకృష్ణ సరికొత్తగా కనిపించారు. మంచు కొండల్లో ఆయన్ని పరిచయం చేస్తూ.. ఓ ఫైట్ సీన్ చూపించారు. 'నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు తీస్తావా?' అంటూ విలన్‌కి వార్నింగ్ ఇచ్చే ఓ డైలాగ్ కూడా ఉంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)మంచు కొండల్లో బాలయ్య నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ కాస్త కృత్రిమంగా అనిపించాయి. అలానే విలన్ ఎవరనేది రివీల్ చేయలేదు. ఎప్పటిలానే తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకున్నాడు. సెప్టెంబరు 25న సినిమాని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. మరి అది తేదీకి పవన్ 'ఓజీ' కూడా రిలీజ్ కానుంది. ఇద్దరూ వస్తారా? లేదంటే ఎవరైనా తప్పుకొంటారా అనేది చూడాలి?ఈ సినిమాకు బోయపాటి దర్శకుడు కాగా.. 14 రీల్స్ సంస్థతో పాటు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఓ నిర్మాతగా వ్యవహరిస్తోంది. 'అఖండ' నుంచి సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన బాలయ్య.. తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలతో వరస హిట్స్ అందుకున్నారు. తాజాగా రిలీజైన 'అఖండ 2' టీజర్ చూస్తుంటే మరోసారి ప్రేక్షకుల్ని అలరించడం ఖాయమనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?) -
'అఖండ 2' అప్డేట్తో పాటు NBK111.. మొదలైన తాండవం
నందమూరి బాలకృష్ణ 'అఖండ' తాండవం మొదలైంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'అఖండ 2' నుంచి తాజాగా అప్డేట్ ప్రకటించారు. జూన్ 9న సాయిత్రం 6.03గంటలకు టీజర్ విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో సంయుక్తా మేనన్, ఆది పినిశెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు. తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా బాలయ్యతో సినిమా ప్రకటించాడు NBK111పేరుతో ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.2021లో విడుదలైన అఖండ చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్ 2ను తెరకెక్కించారు. ఈ ఏడాది దసరా సందర్బంగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, అదేరోజున పవన్ కల్యాణ్ ఓజీ సినిమా కూడా రానుంది. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన అఖండ2 పోస్టర్లో రిలీజ్ డేట్ ప్రకటించలేదు. దసరా బరిలో ఈ రెండు పోటీలో ఉంటాయా..? అనే విషయం తెలియాలంటే అఖండ2 టీజర్‌తో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.Brace yourselves for the divine fury 🔥 #Akhanda2 - The Teaser Thaandavam from tomorrow ❤🔥#Akhanda2Teaser out on June 9th at 6.03 PM 🔱🔥#Akhanda2Thaandavam'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial @MusicThaman @14ReelsPlus @iamsamyuktha_… pic.twitter.com/bD5Y7uRofb— 14 Reels Plus (@14ReelsPlus) June 8, 2025 -
‘అఖండ 2’ నుంచే కారు గిఫ్ట్.. బాలయ్య రెమ్యునరేషన్ ఎంతంటే?
ఇటీవల సంగీత దర్శకుడు తమన్‌కి హీరో బాలకృష్ణ(Balakrishna ) ఓ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని ధర దాదాపు కోటీన్నర వరకు ఉంటుంది. బాలయ్య నుంచి అంతపెద్ద బహుమతి రావడం తమన్‌తో పాటు టాలీవుడ్ మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. నిజంగా బహుమతిగానే ఇచ్చాడా? లేదంటే దీని వెనుక ఏదైనా మతలబు ఉందా? అని నెటిజన్స్ చర్చిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం తమన్ ఫ్రీగా ఫండ్ రైజింగ్ ప్రొగ్రాం చేశాడు. దానికి ప్రతిఫలంగా బాలయ్య ఈ గిఫ్ట్ ఇచ్చాడనే వార్తలు కూడా నెట్టింట వినిపించాయి. (చదవండి: సినీతారలకు ముద్దులూ, రొమాన్స్ నేర్పేది వీరే...)అయితే ఇక్కడ వాస్తవం ఏంటనేది ఎవరికీ తెలియదు. గిఫ్ట్‌గా ఇచ్చానని బాలయ్య చెప్పడం..అభిమానంతో ఇచ్చాడని తమన్ మురిసిపోవడం మాత్రమే అందరికి తెలుసు. అయితే టాలీవుడ్లో ఇలా ఒకరు మరొకరి గిఫ్ట్ ఇచ్చారంటే.. ఏదో ఆశించి ఇచ్చినట్టేననే టాక్ అయితే ఉంది. అది సినమాల పరంగానా లేదా పర్సనల్గానా అనేది తెలియదు కానీ బహుమతి వెనుక బహుళ ప్రయోజనాలే ఉంటాయి.ఇటీవల బాలయ్య నటించిన చిత్రాలన్నింటికి తమనే సంగీతం అందిస్తున్నాడు. ‘డిక్టేటర్’, ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ ‘డాకు మహారాజ్’ ఇవన్నీ మ్యూజిక్ పరంగా మంచి విజయం సాధించాయి. అందుకే తమన్ బాలయ్యకు క్లోజ్ అయ్యాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న ‘అఖండ 2’(Akhanda 2 Movie) కి కూడా తమనే సంగీతం అందిస్తున్నాడు. అయితే బాలయ్య కెరీర్‌కి బిగ్గెస్ట్ విజయాలు అందించిన బోయపాటిని కాదని తమన్‌కు బహుమతి ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ గిఫ్ట్‌కి అఖండ 2 నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట డబ్బులు ఇచ్చారట. తన రెమ్యునరేషన్లో డబ్బులు కట్ చేసి కారు కొనివ్వమని బాలయ్య చెప్పడంతో నిర్మాతలు ఆ పని చేశారట. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఆఖండ 2కి బాలయ్య అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. రూ.35 కోట్ల వరకు పారితోషికంగా అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా వాయిదాల ప్రకారం బాలయ్య చేతికి చేరుతుంది. డాకు మహారాజ్‌కి రూ.28 కోట్లు తీసుకున్న బాలయ్య..తదుపరి చిత్రానికి ఏకంగా 7 కోట్లను పెంచేశాడు. అయితే ఇతర స్టార్ హీరోలతో పోలిస్తే మాత్రం బాలయ్య తీసుకునేది తక్కువే అని ఇండస్ట్రీ టాక్. -
రాయలసీమ రమ్మంటోంది
రాయలసీమ నేపథ్యం సినిమాలంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఎన్నో సినిమాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ కూడా రాయలసీమ నేపథ్యంలో రూపొందిన సినిమాయే. కాగా ప్రస్తుతం ‘రాయలసీమ రమ్మంటోంది’ అంటూ కొందరు తెలుగు హీరోలు రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాల వివరాల్లోకి వెళితే...అఖండ తాండవంబాలకృష్ణ కెరీర్లో రాయలసీమ నేపథ్యంలో రూపొందిన ‘సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, ఇటీవలి కాలంలో ‘అఖండ, డాకు మహారాజ్’ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. హీరో బాలకృష్ణ–దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ’ (2021) మూవీ అనంతపురం నేపథ్యంలో ఉన్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ మూవీకి సీక్వెల్‌గా బాలకృష్ణ– బోయపాటి శ్రీను కాంబినేషన్లోనే ‘అఖండ 2: తాండవం’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ సంయుక్త ఓ కీ రోల్ చేస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ‘అఖండ 2: తాండవం’ కూడా ‘అఖండ’ సినిమా మాదిరి అనంతపురం నేపథ్యంలోనే ఉంటుందని ఊహించవచ్చు. ఈ సినిమాను సెప్టెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. నవ్వించేకి వస్తుండా! ‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా!’ అని ఇటీవల తన కొత్త సినిమా గురించి వరుణ్ తేజ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. దీంతో వరుణ్ తేజ్ నెక్ట్స్ మూవీ రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని స్పష్టమైపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వియత్నాంలో జరుగుతున్నాయి. పనిలో పనిగా ఈ మూవీ చిత్రీకరణ కోసం లొకేషన్లను కూడా వెతుకుతున్నారు మేకర్స్. ఈ పనుల కోసం హీరో వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ ప్రస్తుతం వియత్నాంలోనే ఉన్నారు. హారర్–కామెడీ జానర్లో రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ సినిమా ప్రధానంగా అనంతపురం నేపథ్యంలో ఉంటుందని, ‘కొరియన్ కనక రాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించనున్నాయి.19వ శతాబ్దంలో...‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో మరో చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. 19వ శతాబ్దంలో 1854–1878 మధ్య కాలంలో జరిగిన కొన్ని చారిత్రక వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందనున్నట్లుగా తెలుస్తోంది. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన కాలంలో జరిగిన కొన్ని చారిత్రక అంశాలను ఈ మూవీలో ప్రస్తావించనున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుందట. ఈ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా నటించిన విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలకు అమితాబ్ బచ్చన్, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూలను మేకర్స్ సంప్రదించారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యాక్షన్ లవ్‌స్టోరీ ‘ఏజెంట్’ మూవీ తర్వాత అక్కినేని అఖిల్ తర్వాతిప్రాజెక్ట్పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ అఖిల్ తర్వాతి చిత్రం చిత్రీకరణ ఆల్రెడీ మొదలైందని, రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ లవ్‌స్టోరీ ఫిల్మ్‌కి ‘లెనిన్’ అనే టైటిల్ అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ చిత్రంలో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారని తెలిసింది. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ దర్శకుడు మురళీ కిశోర్ ‘లెనిన్’ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలిసింది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ మూవీని నిర్మిస్తున్నాయని సమాచారం. మాస్ సంబరాలు ‘ఏటి గట్టు సాచ్చిగా చెబ్తాండ ఈ తూరి నరికినానంటే అరుపు గొంతులో నుంచి కాదు... తెగిన నరాలొన్నించొచ్చాది!... ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం కోసం సాయిదుర్గా తేజ్ చెప్పిన డైలాగ్ ఇది. దాదాపు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ ΄్యాక్డ్ మూవీని కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.రాజకీయం... ప్రతీకారం అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘రాచరికం’. సురేశ్ లంకలపల్లి దర్శకత్వంలో ఈశ్వర్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 1న విడుదల కానుంది. పూర్తిగా రాయలసీమ నేపథ్యంలో సాగే ఫిల్మ్ ఇది. లవ్, యాక్షన్, రాజకీయాలు, ప్రతీకారం వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందింది. రాయలసీమ నేపథ్యంలో మరికొందరు కుర్ర హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఇంకొందరు రాయలసీమ కథలు వింటున్నారు. – ముసిమి శివాంజనేయులు -
64 ఏళ్ల హీరోతో జత కడుతున్న 29 ఏళ్ల హీరోయిన్ (ఫోటోలు)
-
అఖండ-2 హీరోయిన్ను ప్రకటించిన మేకర్స్
‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి హిట్ సినిమాల తర్వాత హీరో బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ మూవీలో హీరోయిన్గా సంయుక్తా మీనన్(Samyuktha Menon) ఎంపికయ్యారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం మహా కుంభమేళాలో జరుగుతోంది. సినిమాలోని కీలక సీన్స్ షూట్ చేస్తు న్నారు. అయితే ఇప్పటివరకూ హీరోయిన్ ఎవరు? అనే విషయంపై చిత్రబృందం ప్రకటించలేదు. తాజాగా సంయుక్తా మీనన్ హీరోయిన్గా ఎంపిక అయినట్లు మేకర్స్ ప్రకటించారు. సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమేరా: సి. రాంప్రసాద్, సంతోష్ డి. -
మహా కుంభమేళాలో...
‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి హిట్ సినిమాల తర్వాత హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ మహా కుంభమేళాలో సోమవారం ప్రారంభమైంది.‘‘ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో ‘అఖండ 2’ చిత్రీకరణ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. సినిమాలోని పలు కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నాం. సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా:సి.రాంప్రసాద్, సంతోష్ డి. -
Akhanda 2 Release Date: బాలయ్య యాక్షన్ తాండవం.. బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
నందమూరి బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం అఖండ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2 తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ మేరకు అఖండ-2 తాండవం పేరుతో ప్రోమోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తోన్న ఈ మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో బాలయ్య డైలాగ్ అభిమానులను అలరిస్తోంది. ఇందులో బాలయ్య యాక్షన్ ఉగ్రరూపం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. The protector of Dharma will rage a powerful battle 🔱#Akhanda2 - Thaandavam shoot begins 💥💥Grand release worldwide for Dussehra on SEPTEMBER 25th, 2025 ❤🔥▶️ https://t.co/l2WnhFjwRj'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman @14ReelsPlus… pic.twitter.com/oZeJPHNwQR— 14 Reels Plus (@14ReelsPlus) December 11, 2024 -
ఎన్టీఆర్ రూట్ లో బాలకృష్ణ
-
బాలయ్య అఖండ-2 పూజా కార్యక్రమం.. క్లాప్ కొట్టిన కూతురు బ్రాహ్మణి (ఫొటోలు)
-
'అఖండ 2' సినిమాపై ప్రకటన.. పోస్టర్ రిలీజ్
బాలకృష్ణ కెరీర్లో 'అఖండ' ఓ టర్నింగ్ పాయింట్. లాక్డౌన్ టైంలో అసలు సీజన్ కాని డిసెంబరులో రిలీజైన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. అప్పట్లోనే ఈ మూవీ సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు ఆ మాట ప్రకారం అధికారికంగా అనౌన్స్ చేశారు. 'అఖండ 2' అనే టైటిల్‌కి తాండవం అనే ట్యాగ్ లైన్ జోడించారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: పిచ్చోడిలా ప్రవర్తించిన పృథ్వీ.. కానీ అనుకున్నది జరగలే!)తొలి భాగం ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే ఈ రెండో భాగం మొదలవుతుంది. పాప పెద్దయిన తర్వాత ఏం జరిగిందనేది చూపించబోతున్నారు. 'స్కంద' డిజాస్టర్ తర్వాత బయట కనిపించని బోయపాటి.. గత కొన్నాళ్లుగా దీని స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అది పూర్తి చేయడంతో అధికారికంగా ప్రకటించారు. బుధవారం పూజాతో మూవీ లాంచ్ చేయనున్నారు.ప్రస్తుతం డైరెక్టర్ బాబీ మూవీతో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. దీని షూటింగ్ డిసెంబరుకి పూర్తవుతుంది. దీని తర్వాతే 'అఖండ 2' షూటింగ్లో బాలకృష్ణ పాల్గొంటారు. సీక్వెల్‌కి తమన్ సంగీతమందిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మిగతా విషయాల్ని త్వరలో వెల్లడిస్తారు. పాన్ ఇండియా మూవీగా ఇది రాబోతుంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చేసిన కంటెస్టెంట్.. అదే కారణం!)