బాలయ్య అఖండ-2.. బ్లాస్టింగ్‌ రోర్‌ వచ్చేసింది! | Akhanda 2: Thaandavam Blasting Roar Video Out Now | Sakshi
Sakshi News home page

Akhanda 2: అఖండ-2 మూవీ.. బ్లాస్టింగ్‌ రోర్‌ వీడియో రిలీజ్!

Oct 24 2025 5:12 PM | Updated on Oct 24 2025 5:18 PM

Akhanda 2: Thaandavam Blasting Roar Video Out Now

బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న యాక్షన్‌ మూవీ అఖండ 2 తాండవ. 2021లో విడుదలైన అఖండ చిత్రానికి సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇటీవలే రిలీజ్‌ డేట్ ప్రకటించారు మేకర్స్.

తాజాగా అఖండ-2 నుంచి ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. బ్లాస్టింగ్‌ రోర్‌ అనే పేరు ఈ వీడియోను పంచుకున్నారు. ఇందులో ఈ చిత్రంలోని ఫైట్ సీన్‌, డైలాగ్ బాలయ్య అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ వీడియోను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఈ మూవీని డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement