సినిమా హీరోలకు అభిమానులు ఉండడం సహజమే. అయితే ఒక నటుడికి మరో నటుడు అభిమానం కావడం కాస్త అరుదు. అలా సినీ పరిశ్రమలో వివాదరహితుడిగా పేరు గాంచిన స్టార్ హీరో అజిత్‌కు శింబు వీరాభిమాని కావడం విశేషం. ఈ విషయాన్ని శింబు బహిరంగంగానే పలు వేదికలపై చెప్పారు. ఒక నటుడిగా తనకు అజిత్ మార్గదర్శి అని చెప్తూ ఉంటారు. తాజాగా శింబు.. అజిత్‌పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు.
ఫేవరెట్ హీరోను కలిసిన శింబు
అజిత్ సినిమాలతోపాటు కార్ రేస్‌లపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు అంతర్జాతీయ కార్ రేసుల్లో పోటీ చేసి పథకాలను పొందారు. తాజాగా మలేషియాలో జరుగుతుననన్న కార్ రేస్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఓ ఈవెంట్ కోసం మలేషియా వెళ్లిన శింబు ప్రత్యేకంగా అజిత్‌ను కలిసి ఆయనకు తన మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన అజిత్ జట్టు కోసం చేసిన జెర్సీ ధరించడం విశేషం.
ఆశీర్వాదం
శింబు తాజాగా వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని అజిత్‌కు తెలిపి, ఆయన ఆశీస్సులు అందుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తరువాత ఇలా అజిత్, శింబు కలుసుకోవడం మరో విశేషం. అజిత్‌తో కలిసి శింబు దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఆ డైరెక్టర్‌తో వన్స్ మోర్
అజిత్ మలేషియాలో జరుగుతున్న కార్ రేస్ ముగిసిన తరువాత తన తర్వాతి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతారని తెలిసింది. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. వీరి కాంబోలో ఇంతకుముందు గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రం వచ్చిందన్న విషయం తెలిసిందే!
#SilambarasanTR
மலேசியா Racing Circuitல்
அஜித் குமாரை சந்தித்த சிம்பு
#Simbu #Silambarasan #AK #Ajithkumar #AjithKumarRacing #Ajith #Malaysia #STR #Atman pic.twitter.com/OqE9vo7ptB— Actor Kayal Devaraj (@kayaldevaraj) December 6, 2025


