ఆసక్తికరంగా ఆది పినిశెట్టి ‘డ్రైవ్‌’ ట్రైలర్‌! | Aadhi Pinisetty Drive Movie Trailer Out | Sakshi
Sakshi News home page

ఆసక్తికరంగా ఆది పినిశెట్టి ‘డ్రైవ్‌’ ట్రైలర్‌!

Dec 9 2025 5:32 PM | Updated on Dec 9 2025 5:38 PM

Aadhi Pinisetty Drive Movie Trailer Out

ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘డ్రైవ్’. ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ గా కనిపించనుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జెనూస్ మొహమద్ దర్శకత్వం వహించారు. ఈ నెల 12న "డ్రైవ్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

"డ్రైవ్" సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - ప్రజా మీడియా కార్పొరేషన్ సౌతిండియాలో పేరున్న మీడియా సంస్థ. ఈ సంస్థ అధిపతి జే (ఆది పినిశెట్టి) తన ఫియాన్సే (మడోన్నా సెబాస్టియన్)తో కలిసి లండన్ లో స్థిరపడేందుకు సిద్ధమవుతుంటాడు. ఇంతలో అతని సంస్థ అక్కౌంట్స్ ను ఓ హ్యాకర్ హ్యాక్ చేస్తాడు. జే ప్రతి మూవ్ మెంట్ గమనిస్తూ అతన్ని చంపేస్తానని బెదిరిస్తుంటాడు. 

ప్రజా మీడియా కార్పొరేషన్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆన్ లైన్ లో ఉంచుతూ ఆ సంస్థ పరువు, గౌరవాన్ని రోడ్డున పడేస్తాడు. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ తో ఆడుకుంటున్న ఆ హ్యాకర్ ఆట కట్టించేందుకు సిద్ధమవుతాడు జే. ఆ హ్యాకర్ ఎవరు, జే అతన్ని పట్టుకున్నాడా లేదా అనేది ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో "డ్రైవ్" మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement