breaking news
Drive Movie
-
మరో ఓటీటీకి టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆది పినిశెట్టి హీరోగా నటించిన చిత్రం డ్రైవ్. గతేడాది డిసెంబర్ 12న అఖండ-2తో పాటు ఈ మూవీ విడుదలైంది. చాలా కాలం తర్వాత తెలుగులో ఆది పినిశెట్టి నటించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. దర్శకుడు జెనూస్ మొహమ్మద్ తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్గా చేసింది. అయితే ఈ సినిమా థియేటర్స్‌లో ప్రేక్షకులను ఈ మూవీ పెద్దగా మెప్పించలేకపోయింది.ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా అందుబాటులో ఉంది. తాజాగా ఈ మూవీ మరో ఓటీటీకి రానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ చిత్రం జనవరి 30 నుంచి ఆహాలో అందుబాటులో ఉంటుందని ట్వీట్ చేసింది. సైబర్ క్రైమ్స్, హ్యాకింగ్స్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కించారు. Every secret has a price.And someone is always watching👀@AadhiOfficial @MadonnaSebast14 @RajaChembolu @kamalkamaraju @anishkuruvilla @jenusemohamed @AbinandhanR @osho_venkat @PrawinPudi #AnandaPrasad @BhavyaCreations pic.twitter.com/GFARaOuO0S— ahavideoin (@ahavideoIN) January 27, 2026 -
ఓటీటీలో 'ఆది పినిశెట్టి' కొత్త సినిమా.. నెలలోనే స్ట్రీమింగ్
ఆది పినిశెట్టి హీరోగా నటించిన చిత్రం డ్రైవ్.. ఎలాంటి ప్రకటన లేకుండానే సడెన్‌గా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 12 న అఖండ-2 తో పాటు ఈ మూవీ విడుదలైంది. సింగిల్ హీరోగా చాలా కాలం తర్వాత తెలుగులో ఆది పినిశెట్టి నటించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. దర్శకుడు జెనూస్ మొహమ్మద్ తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్గా చేసింది.డ్రైవ్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా అందుబాటులో ఉంది. కేలవలం ఈ చిత్రం రన్ టైమ్ కూడా 1గంట 47నిమిషాలు మాత్రమే ఉంది. అయితే,థియేటర్స్‌లో ప్రేక్షకులను ఈ మూవీ పెద్దగా మెప్పించలేదు. కానీ, ఈ చిత్రానికి సీక్వెల్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. సైబర్ క్రైమ్స్, హ్యాకింగ్స్ నేపథ్యంలో ఈ మూవీ ఉంటుంది. ఓటీటీ ప్రేక్షకులను తప్పకుండా ఈ చిత్రం మెప్పిస్తుంది. -
ఆసక్తికరంగా ఆది పినిశెట్టి ‘డ్రైవ్’ ట్రైలర్!
ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘డ్రైవ్’. ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ గా కనిపించనుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జెనూస్ మొహమద్ దర్శకత్వం వహించారు. ఈ నెల 12న "డ్రైవ్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు."డ్రైవ్" సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - ప్రజా మీడియా కార్పొరేషన్ సౌతిండియాలో పేరున్న మీడియా సంస్థ. ఈ సంస్థ అధిపతి జే (ఆది పినిశెట్టి) తన ఫియాన్సే (మడోన్నా సెబాస్టియన్)తో కలిసి లండన్ లో స్థిరపడేందుకు సిద్ధమవుతుంటాడు. ఇంతలో అతని సంస్థ అక్కౌంట్స్ ను ఓ హ్యాకర్ హ్యాక్ చేస్తాడు. జే ప్రతి మూవ్ మెంట్ గమనిస్తూ అతన్ని చంపేస్తానని బెదిరిస్తుంటాడు. ప్రజా మీడియా కార్పొరేషన్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆన్ లైన్ లో ఉంచుతూ ఆ సంస్థ పరువు, గౌరవాన్ని రోడ్డున పడేస్తాడు. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ తో ఆడుకుంటున్న ఆ హ్యాకర్ ఆట కట్టించేందుకు సిద్ధమవుతాడు జే. ఆ హ్యాకర్ ఎవరు, జే అతన్ని పట్టుకున్నాడా లేదా అనేది ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో "డ్రైవ్" మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది.


