ఓటీటీలో 'ఆది పినిశెట్టి' కొత్త సినిమా.. నెలలోనే స్ట్రీమింగ్‌ | Aadhi Pinisetty Movie Drive OTT Streaming Details | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'ఆది పినిశెట్టి' కొత్త సినిమా.. నెలలోనే స్ట్రీమింగ్‌

Jan 2 2026 10:28 AM | Updated on Jan 2 2026 10:41 AM

Aadhi Pinisetty Movie Drive OTT Streaming Details

ఆది పినిశెట్టి  హీరోగా నటించిన చిత్రం డ్రైవ్‌.. ఎలాంటి ప్రకటన లేకుండానే సడెన్‌గా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్‌ 12 న అఖండ-2 తో పాటు ఈ మూవీ విడుదలైంది. సింగిల్‌ హీరోగా చాలా కాలం త‌ర్వాత తెలుగులో ఆది పినిశెట్టి న‌టించారు. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఆనంద్ ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మించారు. దర్శకుడు జెనూస్ మొహమ్మద్ తెరకెక్కించిన ఈ మూవీలో మ‌ల‌యాళ బ్యూటీ మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్‌గా చేసింది.

డ్రైవ్‌ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో  స్ట్రీమింగ్‌ అవుతుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళంలో కూడా అందుబాటులో ఉంది. కేలవలం ఈ చిత్రం రన్‌ టైమ్‌ కూడా 1గంట 47నిమిషాలు మాత్రమే ఉంది. అయితే,థియేటర్స్‌లో ప్రేక్షకులను ఈ మూవీ పెద్దగా మెప్పించలేదు. కానీ, ఈ చిత్రానికి సీక్వెల్‌ను కూడా మేకర్స్‌ ప్రకటించారు.  సైబ‌ర్ క్రైమ్స్‌, హ్యాకింగ్స్ నేప‌థ్యంలో ఈ మూవీ ఉంటుంది. ఓటీటీ  ప్రేక్షకులను తప్పకుండా ఈ చిత్రం మెప్పిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement