పిలిచే మల్లికా... | First lyrical video of song Majako Malika from Kattalan released | Sakshi
Sakshi News home page

పిలిచే మల్లికా...

Feb 17 2026 12:01 AM | Updated on Feb 17 2026 12:25 AM

First lyrical video of song Majako Malika from Kattalan released

డ్యాన్సర్స్‌తో సునీల్‌

ఆంటోనీ వర్గీస్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ యాక్షన్‌ డ్రామా ‘కాటాలన్‌’. ఈ చిత్రంలో దుషారా విజయన్, సునీల్, కబీర్‌ దుహాన సింగ్, తరందాసు, పార్థ్‌ తివారీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. పాల్‌ జార్జ్‌ దర్శకత్వంలో క్యూబ్స్‌ ఎంటర్‌టైన్ మెంట్స్‌ పతాకంపై షరీఫ్‌ మహమ్మద్‌ నిర్మించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా మే 14న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానుంది.

ఈ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌ ‘మజాకో మల్లికా..’ అనే పాట లిరికల్‌ వీడియోను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్‌ చేశారు. ‘రాజ రా.. రాజ రా రాజా.. పిలిచే మల్లిక... మజాకో మల్లికా..’ అంటూ ‘మజాకో మల్లికా...’ అంటూ తెలుగు వెర్షన్‌ సాంగ్‌ లిరిక్స్‌ వినిపిస్తాయి. అజనీష్‌ లోకనాథ్‌ సంగీతం అందించారు. ఈ పాటకి రాంబాబు గోసాల లిరిక్స్‌ అందించగా, అరుణ్, సమీర పాడారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement