సినిమాలను వదిలేద్దామనుకున్నా.. కానీ.. : అర్జున్ సర్జా | Arjun Sarja Says That He Wanted To leave movies before Gentleman | Sakshi
Sakshi News home page

సినిమాలను వదిలేద్దామనుకున్నా.. కానీ.. : అర్జున్ సర్జా

Feb 16 2026 11:41 PM | Updated on Feb 17 2026 12:28 AM

Arjun Sarja Says That He Wanted To leave movies before Gentleman

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో యాక్షన్ కింగ్‌గా ప్రత్యేక స్థానం సంపాదించిన అర్జున్ సర్జా, సినీమాల్లోకి రాకముందు ఓ పోలీస్‌ ఆఫీసర్‌ అవ్వాలని అనుకున్నారట. తన తండ్రి తనకోసం ఒక డాక్టర్‌ సీటు ఎలాగైనా సంపాదించి ఇస్తాను నువ్వు చదివి డాక్టర్‌ కావాలి అన్నారట. అయితే తనకు డాక్టర్‌ అవ్వాలని లేదు. అయితే అనుకోకుండా తను సినిమాల్లోకి వచ్చానని. తనకి సినీ హీరో అవుతాడని తెలియదని, తనని సినీమాల్లోకి ఎవరో తోసేశారని అర్జున్ అన్నారు. 

అర్జున్ సర్జా తాజాగా తన సినీ ప్రయాణంలోని పలు ఆసక్తికర సంఘటనలను మీడియాతో పంచుకున్నారు. వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న సమయంలో సినిమాలను వదిలేయాలని కూడా ఆలోచించినట్లు ఆయన వెల్లడించారు. ఆ సమయంలో శంకర్ తన వద్దకు వచ్చాడు. కానీ అప్పటికి తను కొత్త వాడు కావడంతో మొదట రిజెక్ట్ చేశాను. అయితే దర్శకుడు శంకర్ వెంటపడి మరీ ‘జెంటిల్‌మెన్’ కథ వినిపించారు. కాగా అందులోని సామాజిక సందేశం తనను ఆకట్టుకుంది. దాంతో ఆ చిత్రానికి ఓకే చెప్పాను.

అయితే ‘జెంటిల్‌మెన్’ చిత్రం తన జీవితాన్నే మార్చేసిందని అర్జున్ గుర్తుచేసుకున్నారు. ఆ చిత్రం కథలోని సామాజిక సందేశం, పాత్ర బలం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఇంత మంచి కథను వదిలేస్తే నాకంటే తెలివితక్కువ వాడు ఉండడు అనిపించింది.  

1993లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. శంకర్ టేకింగ్, ఏఆర్ రెహమాన్ సంగీతం, అర్జున్ నటన అన్నీ కలిసి ‘జెంటిల్‌మెన్’ సినిమాను బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలబెట్టాయి. ఆ చిత్రంతో ఆయన స్టార్‌ హీరోగా మారారు. ఆ తరువాత యాక్షన్ కింగ్‌గా ఎన్నో హిట్లు తన కెరీర్‌లో సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నారు.  

తాజాగా అర్జున్ దర్శకత్వంలో వచ్చిన ‘సీతా పయనం’ వాలెంటైన్స్ డే కానుకగా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ కథానాయికగా నటించడం విశేషం. కుటుంబ విలువలతో పాటు ప్రేమ, రోడ్ జర్నీ అంశాలను మేళవించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ పొందుతోంది.  

అర్జున్ సర్జా చెప్పినట్లుగా ఒక్క నిర్ణయం జీవితాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లగలదు. అర్జున్ సర్జా కెరీర్‌లో ‘జెంటిల్‌మెన్’ అలాంటి మలుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement