మెగాస్టార్ చేతికి పట్టీ.. అసలు విషయం ఇదే | Megastar Chiranjeevi Shares Tweet About His Hand Fracture Surgery, Photo Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Chiranjeevi: 'మెగాస్టార్ చేతికి పట్టీ'.. స్వయంగా వెల్లడించిన చిరంజీవి

Feb 16 2026 9:00 PM | Updated on Feb 17 2026 1:24 PM

megastar chiranjeevi Tweet about His Hand Fracture surgery

తనకు సర్జరీ జరిగిందని  చిరంజీవి స్వయంగా వెల్లడించారు. అల్లు శిరీశ్ నుంచి వెడ్డింగ్ కార్డ్ అందుకునే సమయంలో చేతికి పట్టీ వేసుకుని మెగాస్టార్ కనిపించారు. దీంతో చిరు ఏమైందని ఫ్యాన్స్‌తో పాటు పలువురు ఆరా తీశారు. తాజాగా సర్జరీ జరిగిన విషయాన్ని మెగాస్టార్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

మెగాస్టార్ తన ట్వీట్‌లో రాస్తూ..' నా చేయి పట్టీ గమనించిన తర్వాత చాలా మంది శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇది కేవలం ఒక చిన్న భుజం కీ హోల్ సర్జరీ. నేను బాగా కోలుకుంటున్నా. ఇప్పటికే నా దినచర్య తిరిగి ప్రారంభించా. అత్యుత్తమ ఆర్థ్రోస్కోపీ సర్జన్లలో ఒకరైన డాక్టర్ నితిన్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రక్రియను సజావుగా, సౌకర్యవంతంగా చేయడంలో ఆయన శ్రద్ధ, నైపుణ్యం అద్భుతం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు నా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement