మరో ఓటీటీకి టాలీవుడ్‌ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Aadhi Pinisetty Latest Movie Drive comes To another Ott | Sakshi
Sakshi News home page

Drive Ott: మరో ఓటీటీకి టాలీవుడ్‌ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Jan 27 2026 9:45 PM | Updated on Jan 27 2026 9:45 PM

Aadhi Pinisetty Latest Movie Drive comes To another Ott

ఆది పినిశెట్టి  హీరోగా నటించిన చిత్రం డ్రైవ్‌. గతేడాది డిసెంబర్‌ 12న అఖండ-2తో పాటు ఈ మూవీ విడుదలైంది. చాలా కాలం త‌ర్వాత తెలుగులో ఆది పినిశెట్టి న‌టించారు. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఆనంద్ ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మించారు. దర్శకుడు జెనూస్ మొహమ్మద్ తెరకెక్కించిన ఈ మూవీలో మ‌ల‌యాళ బ్యూటీ మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్‌గా చేసింది. అయితే ఈ సినిమా థియేటర్స్‌లో ప్రేక్షకులను ఈ మూవీ పెద్దగా మెప్పించలేకపోయింది.

ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో  స్ట్రీమింగ్‌ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళంలో కూడా అందుబాటులో ఉంది. తాజాగా ఈ మూవీ మరో ఓటీటీకి రానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ చిత్రం జనవరి 30 నుంచి ఆహాలో అందుబాటులో ఉంటుందని ట్వీట్ చేసింది.  సైబ‌ర్ క్రైమ్స్‌, హ్యాకింగ్స్ నేప‌థ్యంలో ఈ మూవీ తెరకెక్కించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement