రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. స్పందించిన జీవిత | Actress Jeevitha Rajasekhar Respond on Gotila Factory | Sakshi
Sakshi News home page

రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. మేమంతా నవ్వుకున్నాం: జీవిత

Mar 14 2026 11:58 AM | Updated on Mar 14 2026 1:32 PM

Actress Jeevitha Rajasekhar Respond on Gotila Factory

కంటికి కనిపించేదంతా నిజం కాదన్నట్లుగా సోషల్‌ మీడియాలో కనిపించేదంతా కూడా నిజం కాదు. ఆమాటకొస్తే రూమర్స్‌, ఫేక్‌ న్యూస్‌, ఏఐ వీడియోలే ఎక్కువగా ఆన్‌లైన్‌లో వైరలవుతుంటాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్‌ నటుడు రాజశేఖర్‌కు గోటీల ఫ్యాక్టరీ ఉందని, అక్కడ పనిచేసేవారికి లక్షల్లో జీతాలుంటాయంటూ ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. 

 గోటీల ఫ్యాక్టరీ
ఇంకేముంది, రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ అంటూ చిత్ర విచిత్ర పోస్టులు ప్రత్యక్షమవడం, అవి కాస్తా నెట్టింట వైరలవడం జరిగింది. తాజాగా దీనిపై హీరో రాజశేఖర్‌ భార్య జీవిత స్పందించింది. అసలు గోటీల ఫ్యాక్టరీ ఏంటో? అదెందుకు సృష్టించారో తెలీదు. కానీ, అది చూసి నేను, మా ఆయన, పిల్లలు అంతా నవ్వుకున్నాం. ఇప్పుడున్న సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలే ఎక్కువుంటున్నాయి. అందులో నెగెటివిటీ వచ్చిందా? దాన్ని చూసి బాధపడాలా? అనే ఆలోచన ఎవరికీ లేదు. 

అంతా ఫేక్‌
ఆ ప్రచారం మాపై ఏమాత్రం ప్రభావం చూపించలేదు. అయితే మాకు గోటీల ఫ్యాక్టరీ ఉందని, అందులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బు లాగే ప్రయత్నం చేశారని విన్నాను. అది బాధాకరం. సోషల్‌ మీడియాలో వచ్చే న్యూస్‌, రీల్స్‌.. అన్నీ 99% ఫేక్‌. ప్రతి ఒక్కరిదగ్గరికెళ్లి అది ఫేక్‌ అని చెప్పలేం. దయచేసి వాటిని ఎవరూ నమ్మకండి అని జీవిత కోరింది.

చదవండి: మగవాళ్లు కూడా నగలేసుకోండి: అల్లు శిరీష్‌ సలహా

Advertisement
 
Advertisement
Advertisement