పైసా తీసుకోని మ్యూజిక్‌ డైరెక్టర్‌.. మెచ్చుకున్న హీరో | GV Prakash Kumar Did Not Take Remuneration For This Movie, Know Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

ఒక్క రూపాయి తీసుకోని మ్యూజిక్‌ డైరెక్టర్‌

Mar 14 2026 8:42 AM | Updated on Mar 18 2026 2:30 PM

GV Prakash Kumar Did not Take Remuneration for this Movie

సీనియర్‌ నటుడు, రాజకీయ నాయకుడు కరుణాస్‌ వారసుడు కెన్‌ కరుణాస్‌. అసురన్‌, విడుదలై వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి గుర్తింపు పొందాడు. అలాగే హీరో ధనుష్‌, దర్శకుడు వెట్రిమారన్‌ దృష్టిలో పడ్డాడు. అంతేకాకుండా వెట్రిమారన్‌ సహాయ దర్శకుడిగానూ మారాడు. అలాంటి కెన్‌ తాజాగా ఒకేసారి హీరోగా, దర్శకుడిగా అవతారమెత్తి  చేసిన మూవీ యూత్‌. 

రిలీజ్‌ ఎప్పుడంటే?
పర్వతా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కరుప్పయ్య సి.రామ్‌, కౌసల్యకుమార్‌ నిర్మించిన ఈ చిత్రంలో అనిష్మా, మీనాక్షి, ప్రయాన్సీ, ప్రియదర్శిని యాదవ్‌ హీరోయిన్లుగా నటించారు. నళిని, దేవదర్శిని, సురాజ్‌ వెంజారముడు ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ.ప్రకాశ్‌కుమార్‌ సంగీతాన్ని, విక్కీ చాయాగ్రహణం అందించారు. కళాశాల నేపథ్యంలో సాగే ఈ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రం ఈనెల 19వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. 

వాళ్లే కారణం
శుక్రవారం ఉదయం చైన్నెలోని సత్యం థియేటర్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో దర్శకుడు వెట్రిమారన్‌, ధనుష్‌ పాల్గొన్నారు. తాను నటుడిగా, దర్శకుడిగా మారడానికి వెట్రిమారన్‌, ధనుష్‌లే కారణం అని కెన్‌ కరుణాస్‌ ఈ వేదికపై పేర్కొన్నారు. ధనుష్‌ మాట్లాడుతూ.. కెన్‌ ఈ స్థాయికి చేరుకోవవానికి కారణం ఆయన తల్లి దండ్రులేనన్నారు. జీవీ ప్రకాశ్‌ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం అని పేర్కొన్నారు. ఆయన ఈ చిత్రానికి పారితోషికం తీసుకోకుండా పనిచేయడం విశేషం అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement