అనసూయపై అసభ్యకర పోస్ట్‌..నిందితుడి అరెస్టు | Cyberabad Police Arrest Two Men For Abusive Posting Abusive Comments Against Actress Anasuya Bharadwaj On Social Media | Sakshi
Sakshi News home page

అనసూయపై అసభ్యకర పోస్ట్‌.. నిందితుడి అరెస్టు

Mar 14 2026 9:45 AM | Updated on Mar 14 2026 11:07 AM

Man arrested for abusive posts against actress Anasuya Bharadwaj

సాక్షి,హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాలలో నటి, యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌పై అసభ్యకర పోస్టు చేసిన నిందితుడిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబర్‌ 23న  పలువురు  సోషల్‌ మీడియాలోలో తనపై పరువు నష్టం కలిగించే విధంగా, అశ్లీల వ్యాఖ్యలను పోస్ట్‌ చేసి, అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రసారం చేశారంటూ సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కడప జిల్లాకు చెందిన జనార్ధన్‌గా గుర్తించి అరెస్టు చేశారు. 

మరో కేసులో...
సామాజిక మాధ్యమాలలో అసభ్యకర పోస్ట్‌ చేసిన నిందితుడిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు..  వెస్ట్‌ మారేడ్‌పల్లికి చెందిన కొండాపురం అరుణ్‌ కుమార్‌ అనే ఆటో డ్రైవర్‌ యూట్యూబ్‌లో వీడియోలు, రీల్స్‌ చేసేవాడు. ఈక్రమంలో యూట్యూబ్‌ బ్రౌజ్‌ చేస్తున్నప్పుడు ఓ ప్రముఖ నటి పోస్ట్‌ చేసిన రీల్‌ను కిరణ్‌ చూశాడు. ఆ తర్వాత నిందితుడు తన యూట్యూబ్‌ ఖాతా నుంచి నటి రీల్స్‌పై అసభ్యకర రీతిలో అభ్యంతర వ్యాఖ్యను ప్రస్తావిస్తూ పోస్టు చేశాడు. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. ఈనెల 12న నిందితుడు ఇంట్లో ఉన్నప్పుడు పోలీసులు కిరణ్‌ను అరెస్టు చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement