కోలీవుడ్ స్టార్ కార్తీ ప్రస్తుతం వా వాతియార్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ మూవీకి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ చిత్రాన్ని అన్నగారు వస్తారు అనే టైటిల్తో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నైలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.
ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన హీరో కార్తీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు, మలయాళ ఇండస్ట్రీలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించారు. తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి భయం లేకుండా భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారని అన్నారు. అలాగే మలయాళ ఇండస్ట్రీలోనూ ప్రత్యేకమైన కథలు వస్తున్నాయని కార్తీ కొనియాడారు.
మరి కోలీవుడ్ ఇండస్ట్రీకి ప్రత్యేక గుర్తింపు ఎక్కడ? అని కార్తీ ప్రశ్నించారు. వాళ్లలాగా మనం అద్భుతాలు ఎందుకు చేయలేకపోతున్నామో ఆలోచించాలని హితవు పలికారు. మనకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలంటే.. భయానికి దూరంగా ఉండాలన్నారు. అప్పుడే మనం కొత్త ఆవిష్కరణలు చేయడానికి వీలవుతుందని సూచించారు. సరిహద్దులు చెరిపేసి తమిళ సినిమాను ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని కార్తీ వెల్లడించారు.
(ఇది చదవండి: భారీ ధరకు ది రాజాసాబ్ ఓటీటీ డీల్.. ఎన్ని కోట్లంటే?)
అంతేకాకుండా ఓ నటుడిగా వా వాతియార్ తనకు రిస్కీ సబ్జెక్ట్ అని కార్తీ అన్నారు. ఈ సినిమా కత్తితో సావాసం చేయడం లాంటిదని.. తమిళ నటుడు దివంగత ఎంజీఆర్‌ను అనుకరించడాన్ని ఉద్దేశించి కార్తి మాట్లాడారు. దర్శకుడు నలన్ కుమారస్వామి కథ చెప్పినప్పుడు నటించేందుకు సందేహించా.. కానీ తర్వాత ఓకే చెప్పానని తెలిపారు.
"I always think that Telugu makers are doing big films & Malayalam makers are doing different films.. What's the identity of Tamil films..? We can't do new things if we are scared to try.. We need to break the barriers.."
- #Karthi at #VaaVaathiyaar Event pic.twitter.com/5QIyqfr14L— Laxmi Kanth (@iammoviebuff007) December 8, 2025


