ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ ది రాజాసాబ్. ఈ చిత్రం కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
ది రాజాసాబ్ బిగ్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు మరో నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ది రాజాసాబ్ ఓటీటీ డీల్పై అభిమానులతో పాటు ఆడియన్స్లోనూ సస్పెన్స్ ఆసక్తి నెలకొంది. ఇటీవలే జియో హాట్ స్టార్ ఈ మూవీ హక్కులను సొంతం చేసుకుంది. మరి ఈ డీల్ విలువ ఎంతనే దానిపై ఆడియన్స్ ఆరా తీస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్పై సోషల్ మీడియాలో వైరలవుతోంది. ది రాజాసాబ్ మూవీ హక్కులను దాదాపు రూ.140 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఫర్మామెన్స్ ఆధారంగా ఈ డీల్ మరింత పెరగొచ్చని కూడా టాక్ వినిపిస్తోంది. రిజల్ట్ను బట్టి ఈ డీల్ విలువ దాదాపు రూ.150 నుంచి 200 కోట్లకు పెరగవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రాథమికంగా కుదుర్చుకున్న డీల్ కంటే జియో హాట్ స్టార్ అదనంగా మరింత మొత్తాన్ని నిర్మాతలకు చెల్లించాల్సి రావొచ్చు.


