ఆ కల నెరవేరదేమో! దర్శకుడి ఎమోషనల్‌ పోస్ట్‌ | Director Sandeep Raj Emotional Post about Mowgli Release | Sakshi
Sakshi News home page

Sandeep Raj: చెమటోడ్చి, రక్తం చిందిస్తే చివరకు.. నేనే నష్టజాతకుడిని!

Dec 9 2025 2:17 PM | Updated on Dec 9 2025 5:54 PM

Director Sandeep Raj Emotional Post about Mowgli Release

ఫస్ట్‌ సినిమాకే జాతీయ అవార్డు కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదు. కలర్‌ ఫోటో చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు సందీప్‌ రాజ్‌. తర్వాత గుడ్‌ లక్‌ సఖి, ముఖచిత్రం వంటి మూవీస్‌కు రచయితగా పని చేశాడు. అలాగే కొన్ని చిత్రాల్లో నటుడిగానూ మెప్పించాడు. దాదాపు ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత దర్శకుడిగా రెండో సినిమా చేస్తున్నాడు సందీప్‌. అదే "మోగ్లీ".

మోగ్లీ వాయిదా?
యాంకర్‌ సుమ తనయుడు రోషన్‌ హీరోగా, సాక్షి సాగర్‌ మడోల్కర్‌ హీరోయిన్‌గా నటించారు. టీజీ విశ్వప్రసాద్‌, కృతీ ప్రసాద్‌ నిర్మించిన ఈ మూవీ డిసెంబర్‌ 12న విడుదల కానుంది. అయితే సినిమా రిలీజ్‌ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 12న అఖండ విడుదల చేస్తే మోగ్లీకి పెద్ద దెబ్బ పడటం ఖాయం! దీంతో ఈ మూవీని పోస్ట్‌పోన్‌ చేసుకోక తప్పేలా లేదు.

మరో దర్శకుడు తీయాల్సింది
ఈ క్రమంలో దర్శకుడు సందీప్‌ రాజ్‌ (Sandeep Raj) ఎక్స్‌ ఖాతాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు. కలర్‌ ఫోటో, మోగ్లీ సినిమాలు నేను కాకుండా మరో డైరెక్టర్‌ తీయాల్సింది. సినిమా అంటే పడిచచ్చేవాళ్లు, వృత్తిపై నిబద్ధత ఉన్నవారే ఈ రెండు సినిమాల్లో భాగమయ్యారు. ఈ రెండు చిత్రాల్లోని కామన్‌ పాయింట్స్‌ ఏంటో తెలుసా?

దురదృష్టవంతుడిని
1. అంతా బాగా జరుగుతుందనుకునే సమయంలో వాటి రిలీజ్‌ విషయంలో దురదృష్టాన్ని ఎదుర్కోవడం.. 2. ఆ దురదృష్టం నేనేనేమో! నాక్కూడా అలాగే అనిపిస్తోంది. దర్శకత్వం- సందీప్‌ రాజ్‌ అన్న టైటిల్‌ను థియేటర్‌లో చూసుకోవాలన్న నా కల రోజురోజుకీ మరింత కష్టమవుతోంది. వెండితెరకు నేనంటే ఇష్టం లేదేమో! ఎంతో చెమటోడ్చి, రక్తం చిందించి, ప్యాషన్‌తో మోగ్లీ సినిమా చేశాం. రోషన్‌, సరోజ్‌, సాక్షి, హర్ష, డీఓపీ మారుతి, భైరవ.. ఇలా అందరూ ఎంతగానో కష్టపడ్డాం. కనీసం వారికోసమైనా మోగ్లీకి మంచి జరగాలని ఆశిద్దాం అని సందీప్‌ రాజ్‌ రాసుకొచ్చాడు.

 

చదవండి: ప్రియుడితో బ్రేకప్‌.. పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement