ఐదేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతోంది హీరోయిన్ నివేదా పేతురాజ్. మధురైలో పుట్టి దుబాయ్‌లో పెరిగిన ఈ బ్యూటీ ఈ ఏడాది ఆగస్టులో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త రజిత్ ఇబ్రాన్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించింది. ఇంట్లో పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని, వచ్చే ఏడాది జనవరిలో పెళ్లి చేసుకోబోతున్నామని గుడ్‌న్యూస్ చెప్పింది.
బ్రేకప్
కానీ ఈ పెళ్లి పట్టాలెక్కేట్లు కనిపించడం లేదు. వీరిద్దరూ జంటగా కలిసున్న ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. అంతేకాదు, నివేదా, రజిత్ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకున్నారు. దీంతో క్రికెటర్ స్మృతి మంధానలాగే వీరి పెళ్లి కూడా రద్దయినట్లే అని నెటిజన్లు భావిస్తున్నారు. దీనిపై నివేదా పేతురాజ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
సినిమా
నివేదా పేతురాజ్.. ఒరు నాల్ కూతు అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మెంటల్ మదిలో మూవీతో తెలుగులో రంగప్రవేశం చేసింది. చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, పాగల్, దాస్ కా ధమ్కీ, బూ వంటి చిత్రాల్లో నటించింది. ఓటీటీలో పరువు, కాలా అనే వెబ్ సిరీస్‌లలో యాక్ట్ చేసింది. ఒకానొక సమయంలో కాల్‌షీట్స్ సమస్య కారణంగా జూనియర్ ఎన్టీఆర్‌తో నటించే ఛాన్స్ చేజార్చుకుంది.


