తెలుగులో ఎంట్రీ ఇస్తోన్న భజరంగీ భాయిజాన్ ఫేమ్..! | Salman Khan Bajrangi Bhaijaan Fame Harshaali Malhotra Debut In Tollywood | Sakshi
Sakshi News home page

Harshaali Malhotra: తెలుగులో ఎంట్రీ ఇస్తోన్న భజరంగీ భాయిజాన్ ఫేమ్..!

Jul 2 2025 7:55 PM | Updated on Jul 2 2025 8:42 PM

Salman Khan Bajrangi Bhaijaan Fame Harshaali Malhotra Debut In Tollywood

సల్మాన్‌ ఖాన్‌ మూవీ బజరంగీ భాయిజాన్‌లో నటించి అభిమానులను సంపాదించుకున్న నటి హర్షాలీ మల్హోత్రా. ఈ సినిమాలో మున్ని అనే పాత్రలో సినీ ప్రియులను మెప్పించింది. ముంబయికి చెందిన హర్షాలీ బాలనటిగా కెరీర్‌ ప్రారంభించింది. హిందీలో పలు సీరియల్స్‌లో తన నటనతో రాణించింది. 2015లో విడుదలైన బజరంగీ భాయిజాన్‌ మూవీతోనే ఆమెకు గుర్తింపు వచ్చింది.

ప్రస్తుతం హర్షాలీ మల్హోత్రా టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న అఖండ సీక్వెల్‌లో నటిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ చిత్రంలో హర్షాలీ.. జనని పాత్రలో కనిపించనుందని తెలిపారు. ఈ మేరకు హర్షాలీ మల్హోత్రా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

కాగా.. గతంలో బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా అఖండ-2ను తెరకెక్కిస్తున్నారు. ఈ  యాక్షన్‌ మూవీలో సంయుక్త, ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ చిత్రం దసరా ఈ ఏడాది కానుకగా సెప్టెంబరు 25న విడుదల కానుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement