
మద్రాస్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS) జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సైనిక చర్య పాత్రను ఆపరేషన్ సిందూర్ నొక్కిచెబుతుందన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో తాము చెస్‌లో పావుల మాదిరిగా శత్రువుల కదిలికలు తెలుసుకున్నామని చెప్పుకొచ్చారు.
ఐఐటీ మద్రాస్‌లోని అగ్నిశోధ్-ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెల్ (IARC)ను ఉపేంద్ర ద్వివేది ప్రారంభించారు. ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి ఆపరేషన్ సిందూర్ అంశంపై జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడారు.‘ఆపరేషన్ సిందూర్‌లో మేం చెస్ గేమ్ ఆడాం. శత్రువు తదుపరి కదలికలు ఎలా ఉండబోతున్నాయో.. మేం ఏం చేయబోతున్నామో మాకు తెలియదు. దీనిని గ్రే జోన్ అంటారు. గ్రే జోన్ అంటే మనం సంప్రదాయ కార్యకలాపాలకు వెళ్లడం లేదు. మనం చెస్ గేమ్‌లో పావుల్లా ముందుకు సాగాం. శత్రువు అంచనా వేయలేని విధంగా దాడులు చేశాం. పాకిస్తాన్, పీఓకేలో ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగాయి అని చెప్పుకొచ్చారు.
'If you ask a Pakistani, you lost or won...our chief has bcm field Marshal..we must have won, that is why he became the field Marshal', Army Chief General Upendra Dwivedi on Pakistan's narrative strategy for own domestic population after Indian strikes pic.twitter.com/VX5MD12p7u
— Sidhant Sibal (@sidhant) August 9, 2025
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 23వ తేదీన మరుసటి రోజే మేమందరం సమావేశం అయ్యాం. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చాలు చాలు అని చెప్పడం ఇదే మొదటిసారి. ముగ్గురు చీఫ్‌లు ఏదో ఒకటి చేయాలని చాలా స్పష్టంగా ఉన్నారు. ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి అనే స్వేచ్ఛ ఇచ్చారు. అదే మా మనోధైర్యాన్ని పెంచింది అని చెప్పారు. 25వ తేదీన నార్తర్న్ కమాండ్‌ను సందర్శించాం. అక్కడ మేం తొమ్మిది లక్ష్యాలను నాశనం చేశాం. 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాం. ఏప్రిల్ 29న మేం మొదటిసారి ప్రధానమంత్రిని కలిశాము. ఆపరేషన్ సిందూర్ అనే చిన్న పేరు మొత్తం దేశాన్ని ఉత్తేజపరిచింది’ అని తెలిపారు. ఇదే సమయంలో పాకిస్తాన్‌పై భారత్ గెలిచిందా లేక ఓడిందా అనే విషయం పాకిస్తానీలను అడిగితే బాగా చెబుతారు అని చెప్పుకొచ్చారు.