పాక్‌లోకి చొరబడి... దాక్కుని ఉన్న టెర్రరిస్టులను భారత్ హతమార్చలేదా? అనేది ప్రశ్న... సాధారణంగా ఈ ప్రశ్నను ఎవరు అడుగుతారు? ఎవరో భారతీయుడు అడిగి ఉంటాడని మనం అనుకుంటాం. కానీ అలా జరగలేదు. పాకిస్తాన్‌కు చెందిన ఓ మతపెద్ద...జమీయతే ఉలేమా ఇస్లాం చీఫ్‌మౌలానా ఫజలుర్రహ్మన్ .. కరాచీలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ..ఈ ప్రశ్నను అడగడం...గమనార్హం. ఆయన ఎందుకు ఆ మాట అన్నారంటే... వాస్తవంగా ఆఫ్ఘనిస్థాన్‌పై.. దేశం లోపలకి ప్రవేశించి పాక్ ఆర్మీ వరసగా దాడులకు పాల్పడుతోంది.
ఆ దాడులను ఖండిస్తూ... ఇతర దేశాలపై దాడులు చేయడం సమంజసం కాదని... ఒకవేళ అది సరైన నిర్ణయమే అని పాకిస్తాన్ భావిస్తే... మరి భారత్ ఇక్కడికి వచ్చి దాడులు చేయడం కూడా సబబే కదా అని ఆయన సభను ఉద్దేశించి చెప్పారు. ఆఫ్గనిస్తాన్‌పై పాక్ దాడులు ఆపాలని... చర్చలు జరపాలని ఆయన అన్నారు. అయితే దాడులకు మూలకారకుడిగా ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ లక్ష్యంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ దాడులను నివారించి... పాకిస్తాన్... ఆఫ్గనిస్తాన్‌ల మధ్య సయోధ్య కుదర్చడానికి... ఇరు దేశాల మతపెద్దలు ఏకమవుతామని కూడా ఆయన ప్రకటించారు.
పాక్‌లో జరిగిన బహిరంగ సభలో పెద్దల మాటలను ఆఫ్గాన్‌లోని తాలిబాన్ మతపెద్దలు ఆహ్వనించారు. ఇది మంచి సంకేతమని... దాడులకు ఫుల్‌స్టాప్ పెట్టి ఆసిమ్ మునీర్ ఆటలకు అడ్డుకట్ట వేయడానికి ఆ రెండు దేశాల మత పెద్దలు సిద్ధమయ్యారు. ఆ పెద్దల నిర్ణయం... అటు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనగరల్ ఆసిమ్ మునీర్‌లకు చిక్కుల్లోకి నెట్టింది. ముఖ్యంగా ఆసిమ్ మునీర్ గేమ్ చివరి దశకు చేరిందని... ఖేల్ ఖతమ్ అని అక్కడి పత్రికలు రాయడం కూడా ప్రారంభించాయి. అక్కడ అసలేం జరుగుతోందో... జరగబోతుందో... ఇప్పుడు మనం చూద్దాం.
ఇరు దేశాల మతపెద్దల కలయిక ఆర్మీ చీఫ్ మునీర్‌కు పెద్ద చిక్కుల్లోనే నెట్టింది. పాకిస్తాన్- ఆఫ్గాన్‌ల మధ్య చెలరేగిన వివాదాలకు మతపెద్దలు ఆపే ప్రయత్నం చేస్తున్నారని... అసిమ్ మునీర్ లక్ష్యంగా సాగుతున్న ఈ మతపెద్దల కలయిక మునీర్‌కు పెద్ద ఇరకాటంలో నెట్టనుంది. తాలిబాన్ పెద్దలు, పాకిస్తాన్ మత పెద్దల సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. ఆ పెద్దలు కలిసి దాడులను ఆపడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆసిమ్ మునీర్ అనవసరంగా ఆఫ్గాన్‌పై దాడులు చేయిస్తున్నారని.. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలను కూడా చెడగొడుతోందన్నారు. ఇరు దేశాలకు నష్టాల పాలు చేస్తున్న దాడులు వెంటనే ఆపేయాలని పెద్దలు హుకుం జారీ చేశారు.
ఫజలుర్ రహ్మాన్ వ్యాఖ్యలు ఆఫ్గనిస్తాన్‌లో సంబరాలు సృష్టిస్తున్నాయి. ఈ మేరకు తాలిబాన్ ప్రభుత్వ అంతర్గత శాఖల మంత్రి సిరాజుద్దీన్... పాక్ మతపెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే మెట్టు దిగిన పాక్ ప్రభుత్వం మతపెద్దల శాంతి రాయబారాన్ని స్వాగతిస్తున్నామని... ఆఫ్గన్‌పై దాడులు నిలిపివేస్తామని డిప్యూటి ప్రధాన మంత్రి ఇషాక్ దార్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని... ఆర్మీని వెనక్కి రప్పిస్తామని హామీ ఇచ్చారు. అసలు దాడుల ఆలోచనే లేదు... ఇక దాడుల పేరిట ఆఫ్గనిస్తాన్‌పై అరాచకం సృష్టించిన ఆర్మీ చీఫ్ మునీర్ మాత్రం నోరు విప్పడం లేదు.
-మహమ్మద్ అబ్దుల్ ఖదీర్


