ఆపరేషన్ సిందూర్‌తో భారత్‌కు వచ్చిన గుర్తింపును జీర్ణించుకోలేకో ఏమో తెలియదు గానీ ట్రంప్ తరచుగా భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఈ విషయంపై భారత్ ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ట్రంప్ మామ తన తీరు మార్చుకోవడం లేదు. నిన్న ఇజ్రాయెల్ ప్రధానితో జరిగిన భేటీలో కూడా ఈ వ్యాఖ్యలే చేశారు.ఇది చాలదన్నట్లు తాజా ఆజాబితాలో చైనా దేశం కూడా చేరింది.
ఆపరేషన్ సిందూర్ విషయంలో భారత్‌కు తంటాలు తప్పడం లేదు. ఇండియన్ ఆర్మీ ముష్కరుల స్థావరాల్ని వారి స్వస్థలంలోనే ధ్వంసం చేసి ప్రపంచానికి తన సత్తా ఏంటో తెలిసేలా చేసింది. తన జోలికస్తే రిప్లై ఏలా ఉంటుందో చిన్న ట్రైలర్ చూపించింది. దీంతో భారత్‌తో పెట్టుకుంటే ఏమవుతుందో అర్థమైన పాక్ దారికొచ్చింది. ఇరు దేశాలు పరస్పర కాల్పులు విరమణ ఒప్పందంపై సంతకం పెట్టాయి. తాజాగా చైనా ఈ అంశంలో వేలు పెట్టింది. భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించి తానే ఈ యుద్ధాన్ని ఆపానని డ్రాగన్ కంట్రీ ప్రకటించింది
ఆ దేశ విదేశాంగ మంత్రి వాంఘ్ యీ మాట్లాడుతూ " చైనా చాలా దేశాల మధ్య వివాదాల్ని పరిష్కరించింది. మయన్మార్‌లో సందిగ్ధతలు, ఇరాన్ న్యూక్లియర్ సమస్య, భారత్- పాకిస్థాన్ సమస్య, కంబోడియా-థాయిలాండ్ వివాదం, పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య గొడవ ఇలా ప్రపంచ దేశాల మధ్య గొడవలన మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించాం" అని చైనా విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు.
అయితే ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. " మేము ఇదివరకే ఇటువంటి వ్యాఖ్యలను ఖండించాం. భారత్-పాకిస్థాన్ అంశంలో మూడవ పార్టీ జ్యోక్యం లేదు. మా ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం రెండు దేశాల మధ్యలోనే జరిగిందని" భారత్ హెచ్చరించింది. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాక్‌కు మద్ధతుగా నిలిచింది. పాక్‌కు అవసరమైన యుద్ధ సామాగ్రిని, ఫైటర్ జెట్స్ అందించింది. ఆసమయంలో భారత్ చేసిన దాడులలో డ్రాగన్ కంట్రీకి చెందిన కొన్ని వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.


