ఎయిర్‌పోర్ట్‌లో టూరిస్ట్ వీరంగం.. వయాగ్రా మాత్రల‌తో! | Passenger Goes On Kiosk Smashing Rampage At Airport Video Viral, Arrested For Property Damage And Illegal Drugs | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌లో టూరిస్ట్ వీరంగం.. వయాగ్రా మాత్రల‌తో!

Feb 16 2026 11:53 PM | Updated on Feb 17 2026 12:56 PM

passenger goes on kiosk-smashing rampage at airport in wild video

హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ బ్రిటిష్ టూరిస్ట్  బీభత్సం సృష్టించాడు. టెర్మినల్-1 వ‌ద్ద ఉన్న 10 సెల్ఫ్ చెక్-ఇన్ కియోస్క్ (Kiosks) మెషిన్లను ఇనుప రాడ్డుతో అత‌డు ద్వంసం చేశాడు. అత‌డి ప్రవర్తన చూసి అక్కడున్న ఇతర ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.

సెక్యూరిటీ సిబ్బంది వచ్చేలోపే 37 ఏళ్ల బ్రిటిష్ టూరిస్ట్ తీవ్ర ఆస్తి న‌ష్టాన్ని క‌లిగించాడు. సోమ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. స‌ద‌రు వ్య‌క్తిని హాంకాంగ్ పోలీసులు విచారిస్తున్నారు. అయితే అతడి వద్ద అనుమ‌తి లేని వయాగ్రా మాత్రలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

దీంతో అత‌డిపై విమానాశ్రయ ఆస్తులను ధ్వంసం చేసిన కేసుతో పాటు నిషేధిత మందులను కలిగి ఉన్నందుకు కూడా అద‌న‌పు కేసుల‌ను న‌మోదు చేశారు. కాగా కొన్ని దేశాల్లో వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా వయాగ్రా వంటి మందులను తీసుకెళ్లడం శిక్షార్హమైన నేరం.

అయితే అత‌డు విమానాశ్రయానికి వ‌చ్చేట‌ప్ప‌టికి బాగానే ఉన్నాడు. అయితే టిక్కెట్ కొనుగోలు చేసే స‌మ‌యంలో సిబ్బందితో అత‌డికి వాగ్వాదం చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో స‌హనం కోల్పోయిన అత‌డు వీరంగం సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement