విమాన రెక్కలు ఢీ.. తప్పిన పెనుప్రమాదం | Plane wings collide in Mumbai | Sakshi
Sakshi News home page

విమాన రెక్కలు ఢీ.. తప్పిన పెనుప్రమాదం

Feb 3 2026 11:13 PM | Updated on Feb 4 2026 1:55 AM

Plane wings collide in Mumbai

ముంబై ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది.  విమానాశ్రయంలో ఎయిర్‌ఇండియా, ఇండిగో విమానాల రెక్కలు పరస్పరం ఢీకొన్నాయి. ఇండిగో ఫ్లైట్ లాండ్ అయి రన్‌వేపై వస్తుండగా ఈ ఘటన జరుగినట్లు తెలుస్తుంది. అయితే విమానంలోని ప్రయణికులకు ఏటువంటి ప్రమాదం తలెత్తలేదు. ఈ ప్రమాదంపై డీజీసీఏ తక్షణమే స్పందించింది. ప్రమాదంపై వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించింది.

అయితే ఇటీవల విమానాలలో భద్రతా లోపాలు  తరచుగా కనబడడం ఆందోళనకు గురిచేస్తుంది. నిన్న లండన్‌ హీత్రూ విమానాశ్రయం నుంచి బెంగుళూరు వచ్చిన బోయింగ్ 787-8 డ్రీమ్‌ లైనర్ విమానంలో ఇంధన స్విచ్‌ కటాఫ్‌ పొజిషన్‌లోకి వెళ్లింది. దీనిని గమనించిన ఫైలట్లు డీజీసీఏ సిబ్బందికి ఈ వివరాలు తెలియజేశారు. ఇప్పుడు ముంబైలో ఇలా రెండు విమానాల రెక్కలు తాకడం ఆందోళన కలిగిస్తుంది. 

విమానాల నిర్వహణలో ఏలాంటి చిన్న తప్పిదం చేసినా దాని ఫలితం భారీగా ఉంటుంది. గుజరాత్‌ అహ్మాదాబాద్‌లో ఇంధన స్విచ్‌ ఆఫ్ చేసి ఉండడంతో బోయింగ్ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో వందలమంది ప్రాణాలు వదిలారు. ఇటీవల మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనలో మరణించిన సంగతి తెలిసిందే. 

 

Advertisement
 
Advertisement
Advertisement