మరికాసేపట్లో ఆ విమానం ఎయిర్‌పోర్టులో దిగాల్సి ఉంది. అయితే ఏం జరిగిందో తెలియదు ల్యాండింగ్ సక్రమంగా జరగలేదు. రన్‌వేపై విమానం ఒక్కసారిగా ఊగుతూ దిగింది. కాస్త ఉంటే క్రాష్ ల్యాండ్ అయ్యేదే. కానీ, అదృష్టవశాత్తూ అది జరగలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.
యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఒకటి( UA2323 ఫ్లైట్) ఆదివారం మధ్యాహ్నాం చికాగో నుంచి ఒర్లాండోకు బయల్దేరింది. ఎయిర్‌పోర్ట్‌లో దిగే సమయంలో తీవ్ర కుదుపునలకు లోనైంది. అయితే.. పైలట్ చాకచక్యంగా స్పందించడంతో విమానం క్రాష్ ల్యాండ్ తప్పించుకుంది. ప్రమాదం సమయంలో విమానంలో 200 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఎవరూ గాయపడలేదని అధికారలు వెల్లడించారు.
అయితే.. ఈ ఘటన తర్వాత విమానాల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. ప్రయాణికులను ఎయిర్‌పోర్ట్ టర్మినల్‌కు తరలించి.. విమానాన్ని రన్‌వేపై నుంచి జరపడంతో రాకపోకలు యధావిధిగా కొనసాగాయి.
ఫ్లోరిడా నగరం ఓర్లాండోలో గత కొంతకాలంగా విపరీతమైన వానలు, ఈదురు గాలులు వీస్తున్నాయి. ప్రతికూల వాతావరణం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే.. ల్యాండింగ్ సమయంలో నోస్ వీల్(ల్యాండింగ్ గేర్ చక్రం) ఊడిపోయిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఎయిర్‌లైన్స్‌గానీ, ఒర్లాండో ఎయిర్‌పోర్ట్ అథారిటీ కాని దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
🚨WATCH: United Airlines flight nearly crashes during landing at Orlando International Airport (MCO) as nose wheel appears to roll off landing gearpic.twitter.com/bzjY6uQFmT
— Derrick Evans (@DerrickEvans4WV) January 19, 2026


