breaking news
avert accident
-
ఊడిన చక్రం?.. రన్‌వేపై తుళ్లిపడిన విమానం
మరికాసేపట్లో ఆ విమానం ఎయిర్‌పోర్టులో దిగాల్సి ఉంది. అయితే ఏం జరిగిందో తెలియదు ల్యాండింగ్ సక్రమంగా జరగలేదు. రన్‌వేపై విమానం ఒక్కసారిగా ఊగుతూ దిగింది. కాస్త ఉంటే క్రాష్ ల్యాండ్ అయ్యేదే. కానీ, అదృష్టవశాత్తూ అది జరగలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఒకటి( UA2323 ఫ్లైట్) ఆదివారం మధ్యాహ్నాం చికాగో నుంచి ఒర్లాండోకు బయల్దేరింది. ఎయిర్‌పోర్ట్‌లో దిగే సమయంలో తీవ్ర కుదుపునలకు లోనైంది. అయితే.. పైలట్ చాకచక్యంగా స్పందించడంతో విమానం క్రాష్ ల్యాండ్ తప్పించుకుంది. ప్రమాదం సమయంలో విమానంలో 200 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఎవరూ గాయపడలేదని అధికారలు వెల్లడించారు. అయితే.. ఈ ఘటన తర్వాత విమానాల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. ప్రయాణికులను ఎయిర్పోర్ట్ టర్మినల్‌కు తరలించి.. విమానాన్ని రన్‌వేపై నుంచి జరపడంతో రాకపోకలు యధావిధిగా కొనసాగాయి. ఫ్లోరిడా నగరం ఓర్లాండోలో గత కొంతకాలంగా విపరీతమైన వానలు, ఈదురు గాలులు వీస్తున్నాయి. ప్రతికూల వాతావరణం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే.. ల్యాండింగ్ సమయంలో నోస్ వీల్(ల్యాండింగ్ గేర్ చక్రం) ఊడిపోయిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఎయిర్లైన్స్గానీ, ఒర్లాండో ఎయిర్పోర్ట్ అథారిటీ కాని దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. 🚨WATCH: United Airlines flight nearly crashes during landing at Orlando International Airport (MCO) as nose wheel appears to roll off landing gearpic.twitter.com/bzjY6uQFmT— Derrick Evans (@DerrickEvans4WV) January 19, 2026 -
లక్నో: తప్పిన ఘోర విమాన ప్రమాదం
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువక ముందే.. వరుస ఉదంతాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా లక్నో ఎయిర్‌పోర్టులో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. విమానం టైర్ భాగం నుంచి నిప్పు కణికలు ఎగసి పడ్డాయి. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో 250 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం హజ్ యాత్రికులతో జెడ్డా నుంచి బయల్దేరి ఆదివారం ఉదయం లక్నో ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అయితే.. ల్యాడింగ్ సమయంలో ల్యాండింగ్ గేర్ నుంచి నిప్పు కణికలు ఎగసి పడడం సిబ్బంది గమనించారు. విమానం ట్యాక్సీ వేకి చేరుకోగానే.. ప్రయాణికులందరినీ దించేశారు. #BREAKİNG लखनऊ एयरपोर्ट पर बड़ा हादसा टला सऊदी से आए विमान में तकनीकी खराबी लखनऊ एयरपोर्ट पर लैंडिंग के वक्त खराबी लैंडिंग के वक्त विमान के पहिए से निकली चिंगारी#LUCKNOW #LucknowAirport #SV3112 #JeddahToLucknow #planecrash #flightaccident #SaudiArabia pic.twitter.com/GALwi6Q78g— Ritika Rajora (Tv100 News) (@Rrajora07) June 16, 2025ఎడమ టైర్ వద్ద ల్యాండింగ్ గేర్ నుంచి మంటలు వస్తున్నట్లు గుర్తించారు. ఆ వెంటనే ఆర్పేశారు. ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదని.. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.జూన్ 12వ తేదీన అహ్మబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలి పేలిపోయింది. విమానంలోని 241 మందితో పాటు కింద జనావాసాలపై కూలడంతో మరో 33 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్నే నివ్వెర పోయేలా చేసింది. ఈ ఘటనపై హైలెవల్ కమిటీతో భారత ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. -
ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: ఇండిగో విమానానికి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో అకస్మాత్తుగా టైర్లలో పొగలు వ్యాపించాయి. అయితే వెంటనే అప్రమత్తమైన పైలట్, ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు తగు సహాయక చర్యలు చేపట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలోని 155 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీ నుంచి వస్తున్న ఇండిగో విమానం శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్అవుతుండగా మంగళవారం ఈ ఘటన చేసుకుంది. -
ఇండిగోకు తప్పిన ముప్పు: ప్రయాణీకులు విలవిల
సాక్షి, లక్నో: దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన విమానం ఒకటి భారీ ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకుంది. పైలట్ అప్రమత్త కారణంగా ఇండిగో విమానం ప్రమాదం నుంచి బయటపడింది. లక్నో అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. లక్నో చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇండిగో 6ఈ-685 విమానంలో ఒక ఇంజీన్ విఫలమైంది. విమానం బయలుదేరుతున్న సమయంలో ఈ విషయాన్ని గమనించిన పైలట్ టేక్ఆఫ్ని నిలిపివేసి అధికారులను అప్రమత్తం చేశారు. అయితే ఈ విషయాన్ని ప్రయాణికులకు తెలపకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. రన్‌వైపై విమానాన్ని నిలిపి వేయడంతో విమానంలో విపరీతమైన వేడి, ఉక్కపోతతో అల్లాడిపోయారు. దీంతో కొంతమంది ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. మరోవైపు ఇంజన్లో లోపాన్ని సరిచేయడానికి ఇండిగో ఇంజనీర్ల బృందం ప్రయత్నిస్తోంది. -
భళా.. బాలుడి సాహసం
దవనగిరి: ఆ బాలుడు పేరు సిద్దేశ్.. వయసు తొమ్మిదేళ్లు. చదువుతోంది నాలుగో తరగతి. అయితేనేం, అతడికొచ్చిన ఆరాటం, ఆలోచన మాత్రం చాలా గొప్పది. పెద్దవారు కూడా చేయని సాహసాన్ని చేసి ఓ రైలును భారీ ప్రమాదం నుంచి కాపాడాడు. అవరగిరిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సిద్దేశ్ వాళ్ల హోటల్ రైల్వే ట్రాక్ పక్కనే ఉంది. అంతకు ముందు ఓ రైలు వెళుతుండగా పెద్ద శబ్దాన్ని గుర్తించిన ఆ బాలుడు ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా రైలు పట్టా ఒకటి విరిగిపోయి కనిపించింది. ఇదే విషయాన్ని పరుగుపరుగున వెళ్లి తండ్రి మంజునాథ్‌కు చెప్పినా అతడు పెద్దగా పట్టించుకోలేదు. ఈ లోపు ఒక రైలు వస్తుండటంతో ఎంతో సాహసం చేసిన బాలుడు తాను వేసుకున్న ఎర్రటి టీ షర్ట్‌ను తీసి ధైర్యంగా పట్టాలమీదకు వెళ్లి ఊపేయడంతో రైలును కొద్ది దూరంలో ఆపేశారు. అతడి సాహసాన్ని చూసిన రైల్వే అధికారులు మెచ్చుకున్నారు.


