ఇండిగోకు తప్పిన ప్రమాదం ‌: ప్రయాణీకులు విలవిల

IndiGo aircraft engine fails at Lucknow airport, pilot averts major tragedy - Sakshi

సాక్షి, లక్నో: దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన విమానం ఒకటి భారీ ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకుంది. పైలట్‌​ అప్రమత్త కారణంగా ఇండిగో విమానం ప్రమాదం నుంచి బయటపడింది. లక్నో అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. లక్నో  చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో  ఇండిగో  6ఈ-685 విమానంలో ఒక ఇంజీన్‌ విఫలమైంది. విమానం బయలుదేరుతున్న సమయంలో ఈ విషయాన్ని గమనించిన పైలట్‌ టేక్‌ఆఫ్‌ని  నిలిపివేసి అధికారులను అప్రమత్తం చేశారు. అయితే ఈ విషయాన్ని ప్రయాణికులకు తెలపకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. రన్‌వైపై విమానాన్ని నిలిపి వేయడంతో విమానంలో విపరీతమైన వేడి, ఉక్కపోతతో అల్లాడిపోయారు. దీంతో కొంతమంది ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. మరోవైపు ఇంజన్‌లో లోపాన్ని సరిచేయడానికి  ఇండిగో ఇంజనీర్ల బృందం  ప్రయత్నిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top