ఇరాన్‌లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. మధ్య ఆసియాలోని కొన్ని నగరాలకు ఫిబ్రవరి 11 వరకూ విమానాలు రద్దు చేసినట్లు ప్రకటించింది. ప్రయాణికుల భద్రత రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ మేరకు ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ వివరాలను తన అధికారిక ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేసింది. ఇరాన్‌లో చుట్టూ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను మేము గమనిస్తున్నాము. కస్టమర్ల భద్రత రీత్యా టిబిలిసి, అల్మట్టి, బాకు మరియు తాష్కెంట్‌లకు బయలుదేరే ఇండిగో విమానాలు 11 ఫిబ్రవరి రద్దు చేస్తున్నాము. అని ఇండిగో వివరణ ఇచ్చింది. ప్రయాణికులు మరో తేదీలలో విమాన ప్రయాణమో లేదా టికెట్ డబ్బులు పూర్తిస్థాయిలో రీఫండ్ కావాలో వారి ఇష్టం మేరకు ఆఫ్షన్లు ఎంచుకోవచ్చుని తెలిపింది.
అయితే ప్రస్తుతం ఇరాన్‌లో అంతర్గత సంక్షోభం నెలకొంది. అక్కడి ప్రభుత్వంపై వ్యతిరేకతతో అక్కడి ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టడంతో భద్రత బలగాలు కాల్పులు జరిపాయి. ఇందులో వేలాదిమంది మృతిచెందారు. ఈ అంశంపై తొలి నుంచి హెచ్చరిస్తూ వచ్చిన ట్రంప్ ఇరాన్‌కు ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. తమ సైన్యం ఇరాన్‌కు బయిలుదేరిందని ప్రకటించారు. ఇరాన్ సైతం వెనక్కి తగ్గేదిలేదని ప్రకటించడంతో రెండుదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.


