ట్రాన్స్‌జెండర్‌కు స్పష్టమైన నిర్వచనం | Social Justice Minister Dr Virendra Kumar introduces Transgender Persons Amendment Bill | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌జెండర్‌కు స్పష్టమైన నిర్వచనం

Mar 14 2026 7:56 AM | Updated on Mar 14 2026 7:56 AM

Social Justice Minister Dr Virendra Kumar introduces Transgender Persons Amendment Bill

 కిన్నెర్, హిజ్రా, అరావణి, జోగ్తా వంటి గుర్తింపులు ఉన్నవారే  

వారికి హాని తలపెడితే నేర తీవ్రతను బట్టి శిక్షలు  

లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌   

న్యూఢిల్లీ:  ట్రాన్స్‌జెండర్‌ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇస్తూ కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌ శుక్రవారం లోక్‌సభలో ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌(ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌) సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌(ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌) చట్టం–2019లో కొన్ని మార్పులు చేసి ఈ బిల్లును రూపొందించారు. ట్రాన్స్‌జెండర్లకు హాని తలపెట్టే వారికి నేర తీవ్రతను బట్టి శిక్షలు విధించే అంశాన్ని బిల్లులో చేర్చారు. విభిన్న లైంగిక ధోరణులు, స్వీయ లైంగిక గుర్తింపు కలిగిన వ్యక్తులను ట్రాన్స్‌జెండర్‌ కేటగిరీలో చేర్చకూడదని ఇందులో ప్రతిపాదించారు.

 ట్రాన్స్‌జెండర్ల రక్షణ కోసం ఉన్న చట్టం ప్రయోజనాలు అసలైన, అర్హులైన వ్యక్తులకే చేరాలంటే ఈ పదానికి కచి్చతమైన నిర్వచనం ఇవ్వడం అత్యవసరం అని పేర్కొన్నారు. 2019 నాటి చట్టంలోని రక్షణలు, ప్రయోజనాలు చాలా విస్తృతమైనవని తెలిపారు. వాటిని అనర్హులకు అందించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తిని నిర్వచించడానికి బిల్లులో సబ్‌క్లాజ్‌ చేర్చారు. జని్మంచిప్పుడు నిర్ధారించిన లింగం(స్త్రీ లేదా పురుషుడు) కాకుండా, తమకు నచి్చన లేదా భిన్నమైన లింగ గుర్తింపుతో జీవించే వ్యక్తిని ట్రాన్స్‌జెండర్‌ అనొచ్చు. 

సామాజికంగా–సాంస్కృతికంగా కిన్నెర్, హిజ్రా, అరావణి, జోగ్తా, కొజ్జా (నపుంసకుడు) వంటి గుర్తింపులు ఉన్న వ్యక్తులు ట్రాన్స్‌జెండర్లు అవుతారు. ఇంటర్‌సెక్స్‌ వైవిధ్యాలు కలిగిన వ్యక్తి లేదా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లింగ లక్షణాలు ఉన్న వ్యక్తిని ట్రాన్స్‌జెండర్‌గా నిర్వచించాలి. ఒక వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌ అవునో కాదో నిర్ధారించడానికి నిపుణుల సలహా తీసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ లేదా డిప్యూటీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ నేతృత్వంలోని మెడికల్‌ బోర్డుకు ఈ అధికారం ఉంటుంది. ట్రాన్సజెండర్లుగా అధికారికంగా గుర్తింపు పొందిన వ్యక్తులు తమ గుర్తింపును బర్త్‌ సరి్టఫికెట్‌ సహా ఇతర ధ్రువపత్రాల్లో మార్చుకోవచ్చు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement