breaking news
Virendra Kumar Singh
-
ట్రాన్స్‌జెండర్‌కు స్పష్టమైన నిర్వచనం
న్యూఢిల్లీ: ట్రాన్స్‌జెండర్ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇస్తూ కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ శుక్రవారం లోక్‌సభలో ట్రాన్స్‌జెండర్ పర్సన్స్(ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ట్రాన్స్‌జెండర్ పర్సన్స్(ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) చట్టం–2019లో కొన్ని మార్పులు చేసి ఈ బిల్లును రూపొందించారు. ట్రాన్స్జెండర్లకు హాని తలపెట్టే వారికి నేర తీవ్రతను బట్టి శిక్షలు విధించే అంశాన్ని బిల్లులో చేర్చారు. విభిన్న లైంగిక ధోరణులు, స్వీయ లైంగిక గుర్తింపు కలిగిన వ్యక్తులను ట్రాన్స్‌జెండర్ కేటగిరీలో చేర్చకూడదని ఇందులో ప్రతిపాదించారు. ట్రాన్స్జెండర్ల రక్షణ కోసం ఉన్న చట్టం ప్రయోజనాలు అసలైన, అర్హులైన వ్యక్తులకే చేరాలంటే ఈ పదానికి కచి్చతమైన నిర్వచనం ఇవ్వడం అత్యవసరం అని పేర్కొన్నారు. 2019 నాటి చట్టంలోని రక్షణలు, ప్రయోజనాలు చాలా విస్తృతమైనవని తెలిపారు. వాటిని అనర్హులకు అందించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తిని నిర్వచించడానికి బిల్లులో సబ్‌క్లాజ్ చేర్చారు. జని్మంచిప్పుడు నిర్ధారించిన లింగం(స్త్రీ లేదా పురుషుడు) కాకుండా, తమకు నచి్చన లేదా భిన్నమైన లింగ గుర్తింపుతో జీవించే వ్యక్తిని ట్రాన్స్‌జెండర్ అనొచ్చు. సామాజికంగా–సాంస్కృతికంగా కిన్నెర్, హిజ్రా, అరావణి, జోగ్తా, కొజ్జా (నపుంసకుడు) వంటి గుర్తింపులు ఉన్న వ్యక్తులు ట్రాన్స్జెండర్లు అవుతారు. ఇంటర్‌సెక్స్ వైవిధ్యాలు కలిగిన వ్యక్తి లేదా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లింగ లక్షణాలు ఉన్న వ్యక్తిని ట్రాన్స్‌జెండర్‌గా నిర్వచించాలి. ఒక వ్యక్తి ట్రాన్స్‌జెండర్ అవునో కాదో నిర్ధారించడానికి నిపుణుల సలహా తీసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ లేదా డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలోని మెడికల్ బోర్డుకు ఈ అధికారం ఉంటుంది. ట్రాన్సజెండర్లుగా అధికారికంగా గుర్తింపు పొందిన వ్యక్తులు తమ గుర్తింపును బర్త్ సరి్టఫికెట్ సహా ఇతర ధ్రువపత్రాల్లో మార్చుకోవచ్చు. -
సివిల్స్ లో సత్తా చాటిన ఎమ్మెల్యే కొడుకు
పట్నా: బిహార్ అధికార పార్టీ జేడీ(యూ) మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవి కొడుకు హత్య కేసులో ఇరుక్కుని వార్తల్లో నిలిస్తే, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనయుడు తన ప్రతిభతో పతాక శీర్షికలకు ఎక్కాడు. జేడీ(యూ) ఎమ్మెల్యే వీరేంద్ర కుమార్ సింగ్ కుమారుడు డాక్టర్ వివేక్ కుమార్ సివిల్స్ లో సత్తా చాటాడు. మంగళవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో 80వ ర్యాంకు సాధించాడు. తన కుమారుడు సివిల్స్ ర్యాంక్ సాధించడం పట్ల వీరేంద్ర కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. 'కొడుకు తన కంటే బాగుండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. నా కుమారుడు సాధించిన విజయాన్ని ఎలా వర్ణించాలో తెలియడం లేదు. చాలా గర్వంగా ఉంద'ని పేర్కొన్నారు. వివేక్ ఐఏఎస్ సాధిస్తాడని అసలు ఊహించలేదని చెప్పారు. 2010లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాతే అతడిపై నమ్మకం కుదిరిందని వెల్లడించారు. మూడో ప్రయత్నంలో అతడు సివిల్స్ ర్యాంకు సాధించాడని తెలిపారు. 'అమెరికా వెళ్లి ఎండీ చేయాలనుకున్నాడు. వీసా రావడం ఆలస్యం కావడంతో ఐఏఎస్ కు ప్రిపేర్ అవుతానని చెప్పాడు. చాలా కష్టపడాల్సి ఉంటుందని అనగా, అన్నింటికీ సిద్ధమే అన్నాడు. వివేక్ దినచర్య భిన్నంగా ఉండేది. రాత్రిళ్లు చదువుకుని పగలంతా నిద్రపోయే వాడు. ఆరోగ్యం గురించి పట్టించుకునే వాడు కాదు. టైమ్ కు తినమని పదేపదే చెప్పేవాడిని' అని పేర్కొన్నారు. రెండుసార్లు విఫలమైనా కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో సివిల్స్ ర్యాంక్ సాధించానని వివేక్ తెలిపాడు. ప్రస్తుతం అతడు ఢిల్లీలోని సఫ్తార్ గంజ్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు.


