అర్జున్ టెండూల్క‌ర్ కీల‌క నిర్ణ‌యం | Arjun Tendulkar Key-Decision-Play-Goa-Cricket-Future-Speculations | Sakshi
Sakshi News home page

అర్జున్ టెండూల్క‌ర్ కీల‌క నిర్ణ‌యం

Aug 21 2026 12:44 PM | Updated on Aug 21 2026 12:47 PM

Arjun Tendulkar Key-Decision-Play-Goa-Cricket-Future-Speculations

టీమిండియా దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ కుమారుడు అర్జున్ టెండూల్క‌ర్ త‌న కెరీర్ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. కెరీర్ భ‌వితవ్యంపై వ‌స్తున్న ఊహాగానాల మ‌ధ్య అర్జున్ టెండూల్క‌ర్ మ‌రోసారి గోవా త‌ర‌ఫున ఈ ఏడాది దేశ‌వాళీ క్రికెట్‌లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే ఒమ‌న్‌లో క్రికెట్ ఆడేందుకు వెళ్లిన గోవా జ‌ట్టుతో పాటు అర్జున్ వెళ్లలేదు.

దీంతో అత‌డు జ‌ట్టుతో కొన‌సాగుతున్నాడా లేదా అనే దానిపై అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే ఈ వార్త‌ల‌ను ఖండించిన‌ గోవా క్రికెట్ అసోసియేష‌న్ అర్జున్ జ‌ట్టులోనే కొన‌సాగుతాడ‌ని ధ్రువీక‌రించింది. ఇక 2022-23 సీజ‌న్‌కు ముందు అర్జున్ టెండూల్క‌ర్ ముంబై నుంచి గోవాకు మారిన  సంగ‌తి తెలిసిందే.

అంత‌ర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో అంత‌గా రాణించ‌న‌ప్ప‌టికీ, అర్జున్ టెండూల్క‌ర్ ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో మాత్రం మంచి ప్ర‌ద‌ర్శ‌నే క‌న‌బరిచాడు. గోవా త‌ర‌ఫున అర్జున్ 50 వికెట్లు తీయ‌డంతో పాటు గ‌తేడాది రంజీ సీజ‌న్‌లో రాజ‌స్తాన్‌పై సెంచ‌రీ కూడా సాధించాడు.

ఇక ఐపీఎల్‌లో ఆరంభంలో ముంబై ఇండియ‌న్స్‌కు ఆడిన అర్జున్ టెండూల్క‌ర్ ప్ర‌స్తుతం ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివ‌ర‌కు ఆరు  మ్యాచ్‌లాడిన అర్జున్ టెండూల్క‌ర్ 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 2026 సీజ‌న్‌లో ల‌క్నో త‌ర‌ఫున ఏకైక మ్యాచ్ ఆడిన అర్జున్ ఒక వికెట్ తీశాడు.

Read: ‘తులసి మొక్కలో గంజాయి వనం’.. పోలికలు అవసరమా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement