ఓటీటీకి చెన్నై లవ్ స్టోరీ.. ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్..! | This Friday Ott Release Movies List Goes viral | Sakshi
Sakshi News home page

Friday Ott Releases: ఓటీటీకి చెన్నై లవ్ స్టోరీ.. ఏకంగా 13 సినిమాలు స్ట్రీమింగ్..!

Aug 20 2026 7:03 PM | Updated on Aug 20 2026 7:33 PM

This Friday Ott Release Movies List Goes viral

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈసారి థియేటర్లలో రవితేజ హీరోగా నటించిన ఇరుముడి రిలీజ్ కానుంది. దీనిపై ప్రస్తుతానికి బజ్ అయితే బాగానే ఉంది. తండ్రి కూతురు నేపథ్యానికి అయ్యప్ప స్వామి మాల, 41 రోజుల దీక్ష అనే పాయింట్ జోడించి దీన్ని తెరకెక్కించారు. ఈ మూవీతో పాటు అమీర్ లోగ్, ద రెడ్ బ్యాగ్ అనే చిత్రాలు కూడా విడుదల కానున్నాయి.

ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం పెద్దఎత్తున సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ ఫ్రైడే చెన్నై లవ్ స్టోరీ, జన నాయగన్ మూవీస్ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. బాలీవుడ్, హాలీవుడ్‌ సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు రెడీ అయిపోయాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.


నెట్‌ఫ్లిక్స్

  •    ప్యార్ ప్రేమ కళ్యాణం (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 21

  •    ఫేసింగ్ ఎల్ చాపో (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 21

  •    ఐ స్వేర్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 22

జీ5

  •    జన నాయగన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 21

  •    ద ‍గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో (హిందీ మూవీ) - ఆగస్టు 21


జియో హాట్‌స్టార్

  •    వెల్కమ్ టూ ద జంగిల్ (హిందీ సినిమా) - ఆగస్టు 21

సోనీ లివ్

  •    చెన్నై లవ్ స్టోరీ (తెలుగు సినిమా) - ఆగస్టు 21

అమెజాన్ ప్రైమ్

  •   క్లీనప్ కంపెనీ (హిందీ సిరీస్) - ఆగస్టు 21

లయన్స్ గేట్ ప్లే

  •    స్నేక్స్ 5 (చైనీస్ మూవీ) - ఆగస్టు 21

  •    మాంచెస్టర్ సిటీ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 21

  •    స్టిల్ వాటర్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 21

ఆపిల్ టీవీ ప్లస్..

  • అట్లాస్కింగ్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 21

హెచ్‌బీవో మ్యాక్స్..

  • మదర్‌మేరీ(హాలీవుడ్ సినిమా)- ఆగస్టు 21
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement