రణ్‌బీర్‌ కపూర్‌ ‘రామాయణ’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం | Fire Breaks Out on the Sets of Ranbir Kapoor Ramayana | Sakshi
Sakshi News home page

Ramayana Movie: రణ్‌బీర్‌ కపూర్‌ ‘రామాయణ’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Oct 5 2026 6:18 PM | Updated on Oct 5 2026 6:44 PM

Fire Breaks Out on the Sets of Ranbir Kapoor Ramayana

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’. నితీశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తుండగా.. కన్నడ స్టార్‌ యశ్‌ రావణుడి పాత్రలో కనిపించనున్నారు.ప్రస్తుతం ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో చిత్రబృందానికి ఊహించని షాక్ తగిలింది.

సోమవారం మధ్యాహ్నం 4:02 గంటలకు ఫిల్మ్ సిటీలోని రిలయన్స్ మీడియా వర్క్స్, ప్రైమ్ ఫోకస్ వెనుక భాగంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు ముంబై ఫైర్ విభాగం వెల్లడించింది. ప్రైమ్ ఫోకస్ స్టూడియో వెనుక ఉన్న వంద అడుగుల తాత్కాలిక సెట్‌‌లోని పీసీఆర్ యూనిట్‌లో ఈ మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్ వైరింగ్, కేబుల్స్, తలుపులు, చెక్కపలకలు, ఏసీ యూనిట్లు, బాంబులు, ప్లాస్టిక్ సామగ్రి, సౌండ్ సిస్టమ్స్, షూటింగ్ పరికరాలు ఈ అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమయ్యాయి.

సమాచారం అందుకున్న ముంబై ఫైర్ సిబ్బంది, పోలీసులు, బీఎంసీ వార్డ్ కంట్రోల్, 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సాయంత్రం 4:55 గంటల కల్లా మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ఇతర సెట్లకూ నష్టం..
‘రామాయణ’ సెట్టే కాకుండా, పక్కనే ఉన్న స్టూడియోలలో షూటింగ్ జరుపుకుంటున్న ఎంటీవీ ‘హస్టిల్ 5’, ‘పతి పత్నీ ఔర్ పంగా 2’ సెట్లు కూడా ఈ ప్రమాదం కారణంగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ‘పతి పత్నీ ఔర్ పంగా 2’ సెట్‌లో మొదలైన మంటలు క్రమంగా ‘హస్టిల్ 5’ సెట్ వైపు కూడా వ్యాపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు సెట్లకు ఎంత మేర నష్టం వాటిల్లిందనే దానిపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

సినిమా విశేషాలు..
ఇదిలా ఉంటే.. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనుండగా.. తొలి భాగం ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement