‘మళ్లీ కొత్త కాన్సెప్టా అనిల్‌ భయ్యా..’ ఈసారి రజనీకాంత్‌నే.. | Anil Ravipudi Hilarious Fun with Keerthy Suresh Kriti Shetty | Sakshi
Sakshi News home page

January 12 Vidudala: ‘దళపతి’ సీన్‌ రీక్రియేట్‌ చేసిన అనిల్‌ రావిపూడి

Nov 19 2026 1:02 PM | Updated on Nov 19 2026 1:15 PM

Anil Ravipudi Hilarious Fun with Keerthy Suresh Kriti Shetty

వినూత్న ప్రమోషన్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తన కొత్త సినిమా ‘జనవరి 12 విడుదల’ ప్రమోషన్లను కూడా అదే తరహాలో ప్రారంభించారు. ఈ సినిమాలోని పాటల సందడిని రేపటి నుంచి మొదలుకానుందని వినూత్నంగా ప్రకటించారు. 

దళపతి సినిమాలోని
ఇందుకోసం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, శోభన నటించిన ‘దళపతి’ సినిమాలోని ఓ ఫేమస్‌ సన్నివేశాన్ని నటి కృతిశెట్టితో కలిసి రీక్రియేట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. అది నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ‘మళ్లీ కొత్త కాన్సెప్టా అనిల్‌ భయ్యా.. ఈ సారి రజనీసార్‌నే వాడేశారు’గా అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. కాగా ఇంతకముందు వివాహ భోజనంబు చిత్రంలోని సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందం మధ్య బీచ్‌లో జరిగే ఓ సన్నివేశాన్నిమ్యూజిక్ డైరెక్టర్‌ జీవీ ప్రకాశ్‌కుమార్‌తో రీక్రియేట్‌ చేశారు.

వెంకటేశ్‌, కల్యాణ్‌ రామ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్, కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

(ఇదీ చదవండి: ఆ ఒక్క సీన్‌ కోసం నన్ను వాడుకున్నారు: స్టార్‌ నటి)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement