బిగ్‌బాస్ తెలుగు 10 ఆట చివరి దశకు చేరుకోవడంతో హౌస్‌లో విన్నర్ రేసు ఆసక్తికరంగా మారుతోంది. రోజురోజుకూ కొత్త మలుపులు, ఊహించని పరిణామాలతో కంటెస్టెంట్ల మధ్య పోటీ తీవ్రంగా సాగుతోంది. ఈ క్రమంలో బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. హౌస్‌లోకి డిక్టేటర్ టాస్క్‌ను తీసుకొచ్చి కంటెస్టెంట్లకు కొత్త సవాల్ విసిరారు.
(ఇదీ చదవండి: జపాన్‌లో ఉన్న విజయ్‌కు.. స్టార్ హీరో ప్రాంక్ కాల్!)
ఇద్దరు డిక్టేటర్స్‌గా త్రిగుణ్, ముకేశ్
ఈ వారం హౌస్‌లో ఇద్దరు డిక్టేటర్స్ ఉంటారని బిగ్‌బాస్ ప్రకటించారు. అపారమైన శక్తి, ప్రత్యేక అధికారాలతో హౌస్‌మేట్స్ భవిష్యత్తును ప్రభావితం చేయబోతున్నారని వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు కంటెస్టెంట్ల దగ్గర ఉన్న మ్యాజికల్ పవర్స్ గడువు ముగిసిందని, ఇకపై అవేవీ పనిచేయవని స్పష్టం చేశారు.
అయితే ఈ వారం జరిగే పోరాటాల్లో సత్తా చాటిన వారికి బిగ్‌బాస్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని అల్టిమేట్ పవర్ దక్కుతుందని ప్రకటించారు. ఈ శక్తిని సాధించినవారు టికెట్ టు ఫినాలేకు తొలి కంటెండర్‌గా నిలిచే అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతో ఈ వారం పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.
ఆటను శాసించే ఇద్దరు డిక్టేటర్స్‌గా త్రిగుణ్, ముకేశ్‌లను ప్రకటించారు బిగ్‌బాస్. దీంతో వీరిద్దరి మధ్య అధికార పోరు మొదలైంది. ఈ క్రమంలో నిర్వహించిన ఛాలెంజ్‌లో త్రిగుణ్, ముకేష్ పోటీపడ్డారు. ఇద్దరూ గట్టిగానే ప్రయత్నించినప్పటికీ.. టీషర్ట్‌పై ఎక్కువ రంగు మిగిలి ఉండటంతో ముకేష్ విజేతగా నిలిచాడు. సంచాలకులుగా వ్యవహరించిన వంశీ, రామ్ ప్రసాద్ ముకేశ్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో బిగ్‌బాస్ అతడిని సింహాసనంపై కూర్చోబెట్టి డిక్టేటర్‌గా అధికారం అప్పగించారు.
త్రిగుణ్ టీమ్‌లో నలుగురు
డిక్టేటర్‌గా బాధ్యతలు చేపట్టిన ముకేశ్ తన సైనికులను ఎంపిక చేసుకున్నాడు. రామ్ ప్రసాద్, నరేష్, వర్షిణి, సుధీర్, ఆర్కే, అమన్‌లను తన జట్టులోకి తీసుకున్నాడు. మరోవైపు త్రిగుణ్‌కు సైనికులుగా వంశీ, దేబ్జానీ, శివ, నీతూ నిలిచారు. దీంతో హౌస్‌లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఇక ఈ రెండు జట్ల మధ్య జరగబోయే పోరాటాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో చూడాలి.
(ఇదీ చదవండి: 'ఈఎన్‌ఈ రిపీట్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)


