'అతని వల్లే హౌస్‌లో ఉన్నావ్'.. వర్షిణిపై అపూర్వ ఫైర్.. నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే..! | Bigg Boss Season 10 Telugu 11th week Nominations | Sakshi
Sakshi News home page

Bigg Boss Season 10: 'అతని వల్లే హౌస్‌లో ఉన్నావ్'.. వర్షిణిపై అపూర్వ ఫైర్.. నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే..!

Nov 17 2026 7:06 AM | Updated on Nov 17 2026 7:08 AM

Bigg Boss Season 10  Telugu 11th week Nominations

బిగ్‌బాస్ పదో సీజన్ అప్పుడే పదకొండొ వారానికి చేరుకుంది. గతవారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌ శ్వేతానాయుడు హౌస్‌ నుంచి బయటికొచ్చేసింది. అలా పదోవారం ముగిసింది. ఇక వీక్‌ సోమవారం మొదలవ్వగానే నామినేషన్స్‌ గొడవ మొదలైంది. ఈ వారం దశవతారంలో భాగంగా డిక్టేటర్స్ అని పేరు పెట్టారు. ఈ వారంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ హౌస్‌లో అడుగుపెట్టారు.

హౌస్‌లో ఉన్నావారిని నామినేట్ చేసే ఛాన్స్ ఎలిమినేట్ అయినవారికిచ్చారు బిగ్‌బాస్. అలా ఈ సోమవారం హౌస్‌లోకి అపూర్వ, దక్ష, మిథిలేశ్, షాలిని, ఝాన్సీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి ఒక్కొక్కరిని నామినేట్ చేసే ఛాన్స్‌ ఇచ్చారు. మొదట హౌస్‌లో అడుగుపెట్టిన మాజీ కంటెస్టెంట్‌ షాలిని వచ్చిన వెంటనే నీతూని నామినేట్ చేసింది.

ఆ తర్వాత వచ్చిన మిథిలేశ్‌.. హౌస్‌లో ఉన్న ముకేశ్‌ను నామినేట్ చేశాడు. సెల్ఫ్ రెస్పెక్ట్‌ అన్నావ్.. అది ఎక్కడికిపోయిందో తెలియట్లేదు. సుధీర్‌ నా వల్లే హౌస్‌లో ఉన్నాడని చాలా ఓవర్‌గా మాట్లాడావ్ అని ముకేశ్‌ను మిథిలేశ్ అన్నారు. ఆ తర్వాత వచ్చిన దక్ష కూడా నీతూనే నామినేట్ చేసింది. చివరగా హౌస్‌లో అడుగుపెట్టిన ఝాన్సీ.. దేబ్జానీని ఈ వారంలో నామినేషన్స్‌లో ఉండేలా చేసింది. అంతేకాకుండా హౌస్‌మేట్స్‌ కూడా ఒక్కొక్కరిని నామినేట్ చేశారు. అలా ఈ వీక్‌లో నీతూ, వంశీ, వర్షిణి, ముకేశ్, దేబ్జానీ, రామ్ ప్రసాద్, శివ, సుధీర్ నిలిచారు.

వర్షిణి- అపూర్వకు మాటల యుద్ధం..

ఈ నామినేషన్స్‌ ప్రక్రియలో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌ అపూర్వ.. వచ్చి రాగానే వర్షిణిపై మాటల యుద్ధం మొదలెట్టింది. పదివారాలు ఏం పని చేయకుండా.. తెరగా తింటూ.. తనకు తానే హౌస్‌లో మోస్ట్ గ్లామర్ అని ఫీలయ్యే వర్షిణి అంటూ తన అక్కసు బయటపెట్టింది. ముకేశ్ లేకపోతే నువ్వు హౌస్‌లో ఉండేదానివి కాదంటూ వర్షిణిని నామినేట్ చేస్తూ మాట్లాడింది. నువ్వు ఒక డిజాస్టర్ కెప్టెన్‌ అంటూ అపూర్వ.. వర్షిణిపై రెచ్చిపోయింది. ఇది పర్సనాలిటీ షో అని.. కానీ నీది మాత్రం పీ అండ్ బీ అంటూ వర్షిణిపై ఫైరయ్యింది. కేవలం ముకేశ్ వల్లే వర్షిణి హౌస్‌లో కనిపిస్తోందని ఎద్దేవా చేసింది.

అపూర్వకు సైతం వర్షిణి అదిరిపోయే రేంజ్‌లో ఇచ్చిపడేసింది. నీలా వచ్చి రెండు మూడు వారాలకే తాను వెళ్లిపోలేదని కౌంటరిచ్చింది. జనాలు పంపిస్తే హ్యాపీగా తాను బయటికి వెళ్లిపోతానని.. నువ్వు హౌస్‌లో ఉన్నప్పుడు ఏం పీకావ్ అంటూ వర్షిణి ఘాటుగానే స్పందించింది. అలా ఈ వీక్‌ నామిషన్స్ ప్రక్రియ ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement