ఆది సాయికుమార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ అరుంధతి నక్షత్రం. ఈ చిత్రంలో మేఘ శెట్టి, మధు దామరాజు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని 7 పి.ఎం. ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ ఎల్ఎల్పీ బ్యానర్స్‌పై సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని, డా.సూర్యకాంతి కూచిభొట్ల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది.
ఈ మూవీ పూజా కార్యక్రమంలో ముహూర్తపు సన్నివేశానికి నటుడు సాయి కుమార్ క్లాప్ ఇచ్చారు. ప్రొడ్యూసర్స్ రమేష్ పుప్పాల, సూర్యకాంతి కూచిభొట్ల కెమెరా స్విచ్ఛాన్ చేశారు. చిత్ర నిర్మాతలు స్క్రిప్ట్ అందించారు. ఈ మూవీ ఆది సాయికుమార్ కెరీర్‌లో 28వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ స్పెషల్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తుంటే ఒక మంచి రూరల్ ఫ్యామిలీ డ్రామా అని అర్థమవుతోంది. ఈ నెలలోనే అరుంధతి నక్షత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీతమందిస్తున్నారు.


