ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్‌తో నవంబర్ 11న గ్రీస్‌లో ఆయన వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వీరిద్దరూ ఇండియాకు చేరుకున్నారు.అయితే తాజాగా అనిరుధ్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది.
‘15 ఏళ్ల క్రితం ఇదే రోజు నా తొలి పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నుంచి నా ప్రయాణం నిరంతరంగా కొనసాగుతునే ఉంది. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ ఇలా పలు భాషల్లో సంగీతాన్ని అందించడం, అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేయడం, ఎన్నో భారీ చిత్రాల్లో భాగం కావడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చింది.
ఈ పరిశ్రమకు తిరిగి ఏదైనా ఇవ్వాలని
ప్రతి పాట, ప్రతి సహకారం, ప్రతి విజయం తనకు ఓ వరం. 2026లో ‘ఎల్‌ఐకే’, ‘జననాయగన్’, ‘డీసీ’, ‘ది ప్యారడైజ్’, ‘జైలర్ 2’ వంటి చిత్రాలతో ఈ ఏడాది మరింత ప్రత్యేకంగా మారింది’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇదే క్రమంలో తాజాగా ప్రారంభించిన ‘అల్బుకెర్కీ రికార్డ్స్’ కోసం కూడా ప్రస్తావించారు. తనకు ఇంతటి గుర్తింపునిచ్చిన సంగీత పరిశ్రమకు తిరిగి ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. దీని ద్వారా కొత్త తరం సంగీత కళాకారులకు అవకాశాలు కల్పించాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
కాగా తన పాటలను పదే పదే వింటూ, పాడుతూ, ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. 15 ఏళ్ల ప్రయాణం పూర్తయినా.. ఇంకా ఎన్నో కలలు నెరవేర్చుకోవాల్సి ఉందని, మళ్లీ స్టూడియోకు వెళ్తున్నానని పేర్కొన్నారు. ‘ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
(ఇదీ చదవండి: చిరంజీవితో స్టెప్పులేయనున్న రితికా సింగ్..?)
#15YearsOfAnirudh 🫶 https://t.co/WamQsIWc7w
— Anirudh Ravichander (@anirudhofficial) November 16, 2026


