విజయ్‌ సార్‌లా మీరు చేయొద్దు.. ధనుశ్‌కు సాయిపల్లవి రిక్వెస్ట్ | Please don't quit acting like Vijay Sir, Sai Pallavi plea to Dhanush | Sakshi
Sakshi News home page

Sai Pallavi: విజయ్‌లా మిమ్మల్ని కోల్పోవడం నాకిష్టం లేదు..

Nov 16 2026 10:40 AM | Updated on Nov 16 2026 10:46 AM

Please don't quit acting like Vijay Sir, Sai Pallavi plea to Dhanush

కోలీవుడ్ స్టార్ ధనుశ్,  మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ చిత్రం ‘ఓం’. ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న నవంబర్ 20న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇందులో భాగంగా కేరళలోని కొచ్చిలో ఓమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఓం టీమ్ అంతా హాజరైంది.

ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్ సాయిపల్లవి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ధనుశ్ రాజకీయాల్లోకి వెళ్తున్నారన్న వార్తలపై సాయిపల్లవి మాట్లాడింది. ఈ విషయంలో ధనుశ్‌కు ఓ విజ్ఞప్తి చేసింది. మీ జీవితంలో ఏ మార్గంలో వెళ్లినా కూడా.. నటనను మాత్రం వదులుకోవద్దని సూచించింది. సీఎం విజయ్‌లా మేం మరో నటుడి కోల్పోవడం మాకు ఇష్టం లేదని తెలిపింది. దీంతో సాయిపల్లవి కామెంట్స్‌కు అక్కడున్నవారంతా కేరింతలు కొట్టి అభినందించారు.

సాయిపల్లవి మాట్లాడుతూ.. "మీరు ఏది చేసినా, మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. విజయ్ సర్ రాజకీయాల్లోకి వెళ్లి నటించడం ఆపేశారు. ఈ విషయం గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటా. అందుకే ధనుశ్ సార్ మీరు నటనను కొనసాగించాలని నేను ఆశిస్తున్నా. మీ నటన, మీరు  ప్రేక్షకులకు అందించే వాస్తవిక కథలు శాశ్వతంగా కనిపిస్తాయి. 'పొల్లాదవన్' తర్వాత చాలా మంది ఆ బైక్‌ను కొనుగోలు చేసి, మీ శైలిని, మీ వైఖరిని అలవరచుకున్నారు. అలాంటి ప్రదర్శన సృష్టించడానికి మీలాంటి నిజమైన నటుడు కావాలి" అని అన్నారు.

కాగా.. ఈ చిత్రంలో సాయిపల్లవి పోలీస్‌ అధికారిగా కనిపించనుంది. శ్రీలీల, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా.. వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ధనుష్‌, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement