కోలీవుడ్ నటుల్లో మన్సూర్ అలీఖాన్ ఒకరు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న ఈయన సినిమా రంగానికి విలన్‌గా పరిచయమై.. హీరోగా మారి, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా తనకుంటూ ప్రత్యేక స్టానాన్ని పొందారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆరి్టస్ట్‌గా వివిధ పాత్రల్లో నటిస్తున్న ఈయన గత 34 ఏళ్ల క్రితం హీరోగా నటించారు. రాజాదిరాజ రాజ కులోత్తుంగ రాజమార్తాండ రాజగంభీర కార్తవరాయ కృష్ణ కామరాజన్ అనే చిత్రాన్ని నిర్మించారు కూడా.
తమిళ చిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ చిత్ర పరిశ్రమలోనే చిత్రానికి ఇంత పొడుగైన పేరును పెట్టిన నటుడు, నిర్మాత మన్సూర్ అలీఖాన్‌నే అవుతారు. ఈ చిత్రాన్ని రాజ్ కెనడీ పతాకంపై మన్సూర్ అలీఖాన్ నిర్మించడమే కాకుండా కథానాయకుడిగా, సంగీత దర్శకుడిగా, గీత రచయితగా బాధ్యతలను నిర్వహించడం విశేషం. కెప్టెన్ ప్రభాకర్ వంటి సూపర్‌హిట్ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన తర్వాత మన్సూర్ అలీఖాన్ కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం రాజాధిరాజ రాజకులోత్తుంగ రాజమార్తాండ రాజ గంభీర కార్తవరాయ కృష్ణ కామరాజన్.
బాలు ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ త్రంలో నటి నందిని, సిల్క్ స్మిత, డిస్కోశాంతి, వడివుక్కరసి, అభిలాష, నాగేశ్, వీకే.రామసామి, నెపోలియన్, జయ్‌గణేశ్, వెన్నిరా అడై మూర్తి, ఎస్‌ఎస్.చంద్రన్, ఆర్.సుందరరాజన్, గుండు కల్యాణం లాంటి ప్రముఖులు నటించారు. ఇందులోని పాటలను ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం, స్వర్ణలత, చంద్రబోస్ మొదలగు గాయనీ గాయకులు పాడారు. చిత్రంలోని పాటలన్నీ హిట్ అయ్యాయి. ఈ చిత్రం ద్వారానే తంగర్‌బచ్చన్ సినిమాటోగ్రాఫర్‌గా పరిచయమయ్యారు. పొలిటికల్ సెటైరికల్‌గా రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాదింంది. కాగా సుమారు 34 ఏళ్ల తరువాత ఈ చిత్రాన్ని డిజిటల్ ఫార్మెట్‌లో సరికొత్త హంగుల తో వచ్చే ఏడాది జనవరి లో రీ రిలీజ్ చేయనున్నరట్లు మన్సూర్ అలీ ఖాన్ వర్గం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
"Rajadhi Raja Raja Kulothunga Raja Marthanda Raja Gambeera Kathavaraya Krishna Kamarajan" (1993), also known by the initialism RRRKRMRGKK. This is the longest film title ever in Tamil cinema. The film stars #MansoorAliKhan. https://t.co/2HBWoWcUjF
— CineManiac (@movie__maniac) July 14, 2026


