బిగ్‌బాస్ రియాలిటీ షో చూస్తుడంగానే పది వారాలు పూర్తి చేసుకుంది. ఇక వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే చాలు.. నాగార్జున సందడి ఉండనే ఉంటుంది. ఆయన వచ్చి కంటెస్టెంట్లకు క్లాసులు పీకడం మామూలే. అయితే ఈ వారం పెద్దగా నాగ్ ఎవరినీ కూడా టచ్ చేయలేదు. గతవారమంతా ఫ్యామిలీ టైమ్ కావడంతో హౌస్‌ను ఫుల్ ఎమోషనల్‌గా మార్చేశారు. ఇక చివరి రోజు కూడా మరికొందరు కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ షోలో సందడి చేశారు.
ఈ ఆదివారం ఎపిసోడ్‌లో నరేశ్ తండ్రి వేదికపై కనిపించారు. ఆయనతో పాటు జబర్దస్త్ కమెడియన్ కూడా వచ్చారు. నరేశ్ బాగా ఆడుతున్నావని తండ్రి మెచ్చుకున్నారు. అలాగే శ్వేతానాయుడు మదర్ కూడా ఈ షోలో సందడి చేశారు. నువ్వు ఇంకా బాగా ఆడాలని తన కూతురికి సూచించారు. ఆ తర్వాత త్రిగుణ్ ఫాదర్ కూడా వచ్చారు. టాప్-5 ఉండాలని త్రిగుణ్‌కు సూచించాడు. చివర్లో రామకృష్ణ బ్రదర్ అండ్ ఫాదర్ బిగ్‌బాస్ వేదికపై మెరిశారు. తమ వారిని ఒక్కసారిగా నాగార్జున పక్కన చూడడంతో కంటెస్టెంట్ రామకృష్ణ ఫుల్ హ్యాపీ ఫీలయ్యారు. అలా ఈ వారం ఫ్యామిలీ టైమ్ ముగిసింది. అలాగే అమన్ వాళ్ల అక్క, ముకేశ్ బ్రదర్ కూడా ఈ వారం సందడి చేశారు. తమ వాళ్లకు ఇంకా బాగా ఆడాలని సూచించారు. అలాగే శివకుమార్ పేరంట్స్ కూడా ఈ షోకు హాజరై తమ కొడుకును చూసి ఫుల్ ఎమోషనలయ్యారు. అలా ప్రతి కంటెస్టెంట్ నుంచి ఒక ఫ్యామిలీ మెంబర్ వచ్చి బిగ్‌బాస్ వేదికపై అలరించారు.
ఇక నామినేషన్స్‌లో ఉన్న నరేశ్, త్రిగుణ్, శ్వేతానాయుడు, సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, రామకృష్ణ మిగిలారు. వీరిలో ఫ్యామిలీ మెంబర్స్ ముందే కొందరు సేఫ్ అయినట్లు వారితోనే రివీల్ చేశారు. అలా నరేశ్, త్రిగుణ్, రామకృష్ణ సేఫయ్యారు. చివరికీ సుధీర్, శ్వేతానాయుడు, ఆటో రామ్ ప్రసాద్ మాత్రమే మిగిలారు. ఈ ముగ్గురిని వార్ రూమ్‌లో తీసుకెళ్లాడు నాగార్జున. వారి ముందున్న బజర్‌పై చేతులు పెట్టమన్నారు. ఆ తర్వాత ఎవరిదైతే రెడ్ కలర్ సైన్ వస్తుందో వారి హౌస్ నుంచి బయటికి రావాలన్నాడు. వీరిలో శ్వేతానాయుడు ముందున్న బజర్ రెడ్‌కలర్‌లో మెరిసింది. దీంతో శ్వేతానాయుడు ఈ వారం ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించారు. అలా ఈ వారంలో వెల్డ్ కార్డ్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన శ్వేతానాయుడు బిగ్‌బాస్ నుంచి బయటికొచ్చేసింది. ఈ ఎపిసోడ్ చివర్లో హైపర్ ఆది కూడా సందడి చేసి కంటెస్టెంట్లపై పంచ్‌లు విసిరారు.


