breaking news
Eliminated
-
బిగ్‌బాస్ నుంచి 'మాధురి' ఎలిమినేట్.. భారీగా రెమ్యునరేషన్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu) నుంచి 8వ వారంలో మాధురి ( Madhuri) ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం అందరికంటే ఆమెకు తక్కువ రావడంతో హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. నామినేషన్స్‌లో సంజన, మాధురి,రాము, కల్యాణ్, తనూజ, రీతూ, పవన్, గౌరవ్ ఉన్నారు. అయితే, వీరిలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయిన మాధురి, గౌరవ్ మధ్య లాస్ట్ వరకు గట్టి పోటీ నెలకొంది.. కానీ, ఫైనల్‌గా మాధురి ఎలిమినేట్ అయ్యారు. అయితే, బిగ్‌బాస్ నుంచి మాధురికి భారీగానే రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది.సేవా కార్యక్రమాలకు రెమ్యునరేషన్బిగ్ బాస్ హౌస్‌లో మాధురి కేవలం మూడు వారాలు మాత్రమే ఉన్నారు. కానీ, చాలా బలంగానే తన మార్క్ వేశారు. అసలైన ఫైర్ బ్రాండ్‌గా హౌస్‌లో పేరు పొందారు. తన మాటలతో పాటు ఆటలోనూ సత్తా చాటారు. మాధురికి ఉన్న ఇమేజ్ వల్ల బిగ్‌బాస్ కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేవలం మూడు వారాలకే రూ. 9 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఆమె నిలిచారు. అయితే, ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని ఆమె ఇప్పటికే ప్రకటించారు. వికలాంగులు, క్యాన్సర్ రోగుల కోసం తమ వంతు సాయంగా ఈ డబ్బులు వితరణ చేస్తామన్నారు. ఇదే విషయాన్ని దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రకటించారు.మాధురికి హౌస్‌లోకి వెళ్లక ముందే చాలా ట్రోలింగ్‌కు గురయ్యారు. తన వ్యక్తిగత కారణాల వల్ల ఆమె చుట్టూ అనేక వివాదాలు ఉండటంతో నెటిజన్లు ఆమెను ఇష్టపడలేదు. ఆమెను ఎందుకు సెలక్ట్ చేశారంటూ బిగ్‌బాస్ టీమ్‌ను కూడా తప్పుబట్టారు. అయితే, హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఆమె చాలా ముక్కుసూటి మనిషి అంటూ చాలామంది కామెంట్లు చేయడం విశేషం. తనకు అనిపించిన విషయం ఏదైనా సరే బహిరంగంగానే చెబుతారని పేరు పొందారు. తన గేమ్‌లో ఎప్పుడూ కూడా నిజాయితీ కోల్పోలేదని చాలామంది కామెంట్ల రూపంలో తెలిపారు. సోషల్ మీడియాలో ఆమె పట్ల మిశ్రమ స్పందనలు కూడా కనిపించాయి. ఆమె నిజాయితీకి, ధైర్యానికి కొందరు మద్దతు ఇస్తే.. మరికొందరు ఆమె అగ్రెసివ్ తీరు వల్లే బయటకు వచ్చారని అభిప్రాయపడ్డారు. విపరీతమైన నెగటివిటీతో హౌస్‌లోకి అడుగుపెట్టిన మాధురి.. బిగ్‌బాస్ షో వల్ల దానిని కాస్త తగ్గించుకున్నారని చెప్పవచ్చు. ఈ సీజన్లో చాలా పాపులర్ కంటెస్టెంట్‌గా మాధురి పేరు ఎప్పటికీ ఉండిపోయేలా తన గేమ్‌తో చూపించారని ఎక్కువ మంది చెప్పడం విశేషం.నాకు ముందే తెలుసు: మాధురిహౌస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అవుతానని తాను ముందే అనుకున్నట్లు స్టేజీపై నాగార్జునతో మాధురి పంచుకున్నారు. నవంబరు 4 తన భర్త పుట్టినరోజు కాబట్టి ఆయన వద్ద ఉండటం తనకు సంతోషంగా ఉందన్నారు. అయితే, తనకు బిగ్‌బాస్ ఎంతో నేర్పిందని మాధురి పేర్కొన్నారు. హౌస్‌లో తనకు తనూజ అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఆమె చాలా స్వీట్ అంటూ కితాబు ఇచ్చారు. తనూజ సీరియల్లో చేసినట్లు నటిస్తోందని అందరూ అంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. తరువాత కల్యాణ్ ఎలాంటి మాస్క్ లేకుండా నిజాయతీగా ఆడుతున్నాడని చెప్పిన మాధురి.. డిమోన్ పవన్ కూడా చాలా స్వీట్ అంటూనే మంచి అబ్బాయని పేర్కొన్నారు. హౌస్‌లో 100శాతం ఫేక్ ఎవరైనా ఉన్నారంటే అది భరణి మాత్రమేనని చివరిగా తెలిపారు. -
పవన్‌కి రెడ్ కార్డ్.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే?
గతంతో పోలిస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత బిగ్‌బాస్ హౌసులో కాస్త డ్రామా కనిపిస్తోంది. ఈ వారమంతా కూడా భరణి, శ్రీజ మధ్యలో పోటీ పెట్టి రీఎంట్రీ ఎవరు ఇవ్వబోతున్నారనేది తేల్చారు. చివరకు గెలిచిన భరణి.. హౌసులోకి మళ్లీ వచ్చేశాడు. ఇక వీకెండ్ వచ్చిందంటే కచ్చితంగా ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఈసారి కూడా అలానే ఒకరు బయటకెళ్లిపోయారు. కానీ ఒకరు అనుకుంటే మరొకరు ఔట్ అయ్యారట.8వ వారం నామినేషన్స్‌లో సంజన, మాధురి,రాము, కల్యాణ్, తనూజ, రీతూ, పవన్, గౌరవ్ ఉన్నారు. వీళ్లలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయిన మాధురి, గౌరవ్.. తొలిసారి నామినేషన్స్‌లోకి వచ్చారు. దీంతో వీకెండ్ అయ్యేసరికి వీళ్లకే తక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని చిన్న టెన్షన్ ఏర్పడింది. తొలుత గౌరవ్ బయటకొచ్చేశాడని రూమర్స్ వచ్చాయి. కానీ ఫైనల్‌గా మాధురి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: హీరోగా లోకేశ్ కనగరాజ్.. మూవీ టీజర్ రిలీజ్)మరోవైపు లేటెస్ట్ ప్రోమోలో మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. రీతూ-పవన్‌కి సంబంధించిన ఓ వీడియో చూపించిన హోస్ట్ నాగార్జున.. పవన్‌పై సీరియస్ అయ్యారు. ఈ వీడియోలో పవన్.. రీతూని బెడ్‌పైకి తోస్తూ కనిపించాడు. బిగ్‌బాస్ నిబంధనల ప్రకారం.. తోసేయడం, తన్నడం లాంటివి చేయకూడదు. వీడియో ప్లే చేసిన తర్వాత.. 'ఇలాంటి ప్రవర్తన మీ ఇంట్లో ఆడపిల్లలపై చేస్తే బెల్ట్ పెట్టి కొట్టేవారా కాదా ఆడియెన్స్' అని నాగ్ అడిగాడు. అలా తోయడం కరెక్ట్ కాదని ఆడియెన్స్ అనేసరికి.. 'సారీ సర్' అని పవన్ అన్నాడు.సారీ చెబితే బిగ్‌బాస్ క్షమించడు. నీకు రెడ్ ఫ్లాగ్ తప్పదు. నీ బ్యాగ్ సర్దుకే. బిగ్ బాస్ ఓపెన్ ద డోర్ అని నాగార్జున అన్నాడు. దీంతో పవన్ దీనంగా ముఖం పెట్టి కనిపించాడు. మరోవైపు రీతూ.. 'సార్ సార్ వద్దుసార్' అని నాగార్జునని ప్రాధేయపడుతూ కనిపించింది. అయితే ఇదంతా డ్రామా నడిపించడమే కోసమే అనిపిస్తుంది. ఎందుకంటే గత సీజన్లలో ఇలాంటి హంగామా చాలాసార్లు చూపించారు. దీంతో పవన్ బయటకెళ్లడం జరగదులే అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఎప్పటినుంచో ఆ వ్యాధితో బాధపడుతున్నా: రాజశేఖర్) -
బిగ్‌బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్!
బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఒక్కో కంటెస్టెంట్ ఒక్కోలా గేమ్ ఆడుతుంటారు. అయితే వీళ్లలో మధ్యలోనే ఎవరు బయటకొచ్చేస్తారు, ఎవరు చివరి వరకు ఉంటారనేది ఎప్పుడు సస్పెన్స్‌గానే ఉంటుంది. గతవారం అలా భరణి ఎలిమినేట్ కాగానే చాలామంది ఆశ్చర్యపోయారు. ఈసారి అంతకు మించి బిగ్‌బాస్ షాక్ ఇచ్చాడు. పచ్చళ్ల పాపని బయటకు పంపేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?సోషల్ మీడియాలో పచ్చళ్ల బిజినెస్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లలో రమ్య ఒకరు. రెండు వారాల క్రితం ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా 9వ సీజన్లో అడుగుపెట్టింది. కానీ వచ్చిన తొలిరోజు నుంచే టాక్ ఆఫ్ ది హౌస్ అయిపోయింది. ఫిజికల్ టాస్క్‌ల్లో మగాళ్లతోనే బాగానే పోటీ పడుతున్నప్పటికీ నోటి దురుసు, వ్యక్తిగతంగా పలువురు కంటెస్టెంట్స్‌పై కామెంట్స్ చేయడం లాంటి వాటి వల్ల నెగిటివిటీ వచ్చింది. దానికి తోడు వచ్చిన మొదటిరోజునే తనూజ-కల్యాణ్ రిలేషన్ గురించి అనవసర వ్యాఖ్యలు చేయడం కూడా ఈమెకు కాస్త మైనస్ అయ్యాయని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: నాగార్జున రూట్లోనే చిరంజీవి.. కోర్ట్ ఆదేశాలు)ఇకపోతే ఈ వారం రమ్యతో పాటు రీతూ, సాయి శ్రీనివాస్, దివ్య, తనూజ, రాము, సంజన, కళ్యాణ్ నామినేషన్స్‌లో నిలిచారు. వీళ్లలో చూస్తే రమ్య, సాయి తప్పితే మిగిలిన వాళ్లంతా చాలారోజులుగా హౌస్‌లో ఉన్నారు. పలుమార్లు నామినేషన్స్‌లోనూ ఉన్నారు. దీంతో ఈ వారం వీళ్లందరికీ బాగానే ఓట్లు పడ్డాయి. ఓటింగ్ పరంగా చూసుకుంటే తనూజ టాప్‌లో నిలిచినట్లు తెలుస్తోంది. తర్వాతి స్థానాల్లో కల్యాణ్, దివ్య, రీతూ, సంజన ఉన్నట్లు టాక్. చివరి మూడు స్థానాల్లో రాము, సాయి శ్రీనివాస్, రమ్య ఉండగా.. రమ్యగా చాలాతక్కువగా ఓటింగ్ రావడంతో ఈమెని ఎలిమినేట్ చేసేశారట.వాస్తవానికి ఈ వారం ఇప్పటికే ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయింది. ఆమెనే ఆయేషా. డీహైడ్రేషన్, జ్వరం లక్షణాలతో ఈమె హౌస్ నుంచి బయటకొచ్చేసింది. కానీ కొన్నిరోజుల తర్వాత తిరిగి హౌసులోకి వెళ్లే అవకాశముంది. అయితే ఆయేషా బయటకొచ్చేయడంతో ఈ వారం ఎలిమినేషన్ ఉండదేమోనని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదని ఫిక్స్ అయిన నిర్వహకులు.. పచ్చళ్ల పాప రమ్య మోక్షని ఎలిమినేట్ చేసేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: నా దొంగ మొగుడు.. ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్ వైరల్) -
అయేషా మిడ్ వీక్ ఎలిమినేషన్..! ఆ కారణం వల్లే..!
-
ఫ్లోరా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?
లక్స్ పాప ఇమేజితో బిగ్‌బాస్ 9లోకి ఎంట్రీ ఇచ్చిన ఫ్లోరా సైనీ ఎలిమినేట్ అయింది. ఐదో వారంలో బయటకొచ్చేసింది. అయితే ఈమెతో పాటు రీతూ కూడా ఎవిక్షన్ రూంలో ఉన్న టైంలో.. రీతూ నిజంగా ఎలిమినేట్ అయిపోతానేమోనని భయంతో తెగ ఏడ్చేసింది. కానీ ఫ్లోరా బయటకొచ్చేయడంతో రీతూ ఊపిరి పీల్చుకుంది.తొలివారం సంజనతో గొడవపడి కాస్త హడావుడి చేసిన ఫ్లోరా.. తర్వాత వారం నుంచి మాత్రం చాలా సైలెంట్ అయిపోయింది. గేమ్స్ పరంగా పెద్దగా ఆకట్టుకోకపోవడం, అలానే హౌస్‌మేట్స్‌తోనూ పెద్దగా ఇంటరాక్ట్ కాకపోవడం లాంటి కారణాలతో ప్రతివారం నామినేట్ అవుతూ వస్తున్నప్పటికీ సేవ్ అవుతూనే వచ్చింది. కామనర్స్ మనీష్, ప్రియ, హరీశ్.. వరస వారాల్లో ఎలిమినేట్ కావడం ఈమెకు కాస్త ప్లస్ అయింది. ఐదో వారం మాత్రం తప్పించుకోలేకపోయింది.(ఇదీ చదవండి: బర్త్ డే నైట్ మేమిద్దరం మాత్రమే.. అల్లు స్నేహా పోస్ట్ వైరల్)రెమ్యునరేషన్ విషయానికొస్తే.. వారానికి రూ.2.1 లక్షల చొప్పున ఫ్లోరా డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఐదు వారాలు ఉన్నందుకుగానూ రూ.10.5 లక్షల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ఇన్నిరోజులు ఉన్నప్పటికీ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినప్పటికీ.. రెమ్యునరేషన్ పరంగా బాగానే సంపాదించినట్లు కనిపిస్తుంది.ఇక వెళ్తూవెళ్తూ సంజన, దివ్య, ఇమ్మాన్యుయేల్, శ్రీజకి థమ్ అప్ ఇచ్చింది. భరణి, తనూజకి థమ్స్ డౌన్ ఇచ్చింది. సుమన్ శెట్టిని మాత్రం అటుఇటుకి మధ్యలో పెట్టింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి) -
ఈసారి డబుల్ ఎలిమినేషన్.. ఫ్లోరాతో పాటు ఆమె కూడా!
అనుకున్నదే జరిగినట్లు కనిపిస్తుంది. ఈసారి డబుల్ ఎలిమినేషన్ అయిపోయినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌లో ప్రస్తుతం ఐదో వారం నడుస్తోంది. గత నాలుగు వారాల్లో శ్రష్ఠి వర్మ, మనీష్, ప్రియ, హరీశ్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎవరవుతారోనని అందరూ అనుకుంటున్నారు. దానికి తగ్గట్లే ఈసారి ఏకంగా 10 మంది నామినేట్ అయ్యారు. వీళ్లలో ఇప్పుడు ఇద్దరు బయటకెళ్లిపోయారట.బిగ్‌బాస్ నుంచి ఈ వారం.. తొలి వికెట్‌గా ఫ్లోరా బయటకెళ్లిపోయినట్లు ఖరారైపోయింది. లెక్క ప్రకారం తొలి రెండు వారాల్లోనే ఈమె ఎలిమినేట్ అయిపోతుందని అంతా అనుకున్నారు. దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే పెద్దగా యాక్టివ్‌గా ఉండదు, నామినేట్ చేసినా సరే పెద్దగా వాదులాడటం లాంటివి చేయకుండా సరే సరే అని అనడం, గత కొన్నిరోజుల నుంచి అయితే సంజనకు సేవకురాలిగా ఉండటం తప్పితే పెద్దగా చేసినట్లు కనిపించలేదు. దీంతో ఈ వారం ఫ్లోరాని బిగ్‌బాస్ బయటకు పంపేశాడు.(ఇదీ చదవండి: ప్రధాని మోదీని కలిసిన చరణ్-ఉపాసన.. కారణం ఏంటంటే?)ప్రతి సీజన్లోనూ ఐదో వారం దాదాపుగా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఉంటుంది. ఈసారి కూడా ఆరుగురు రాబోతున్నారు. దీంతో డబుల్ ఎలిమినేషన్ ఉండటం గ్యారంటీ అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు అదే జరిగింది. ఫ్లోరాతో పాటు నామినేట్ అయిన వాళ్లలో ఎవరి వికెట్ పడుతుందా అనుకున్నారు. డేంజర్ జోన్లో అయితే శ్రీజ, దివ్య, రీతూ, పవన్, సుమన్ శెట్టి ఉన్నట్లు తెలిసింది. వీళ్లలో నుంచి ఇప్పుడు శ్రీజని కూడా బయటకు పంపేశారట. అయితే ఈ ఎలిమినేషన్ కాస్త విచిత్రంగా సాగింది.మామూలుగా అయితే ఓటింగ్ శాతం తక్కువగా ఉంటే పంపిస్తుంటారు. కానీ శ్రీజని మాత్రం.. హౌస్‌లోకి రాబోతున్న వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ ముకుమ్మడిగా బయటకు పంపేశారట. డేంజర్ జోన్లో ఉన్నవాళ్లలో ఎవరిని ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలని అడగ్గా.. ఎక్కువమంది శ్రీజ పేరు చెప్పారట. దీంతో ఈమెని డబుల్ ఎలిమినేషన్లో బయటకు పంపేశారని తెలుస్తోంది. ఆదివారం ఎపిసోడ్లో ఎలిమినేషన్స్‌తో పాటు వైల్డ్ కార్డ్స్ ఎవరనేది కూడా క్లారిటీ రానుంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే) -
బిగ్‌బాస్ నుంచి మాస్క్ మ్యాన్ ఎలిమినేట్.. కాకపోతే!
ఈసారి షాకింగ్ ఎలిమినేషన్. గత వారం ప్రియ బయటకెళ్లిపోయింది. కానీ ఆమెతో పాటు చివరవరకు డేంజర్ జోన్లో ఉన్న కల్యాణ్ లిస్టులో లేడు. దీంతో ప్రియ దోస్త్ శ్రీజ.. ఈసారి ఎలిమినేట్ కావడం పక్కా అని అందరూ అనుకున్నారు. కానీ గేమ్స్ వల్ల ఈ వారం చాలా లెక్కలు మారిపోయాయి. అయినా సరే మరో కామనర్ ఎలిమినేట్ అయిపోయాడు. అతడే మాస్క్ మ్యాన్ హరీశ్. ఇంతకీ అసలేమైంది?అగ్నిపరీక్ష పోటీలో మంచి ప్రదర్శన ఇచ్చిన హరీశ్.. హౌసులోకి అడుగుపెట్టాడు. అయితే వచ్చినప్పటి నుంచి నాకు నచ్చినట్లు నేనుంటాను. పక్కనోళ్లు కూడ నాకు నచ్చినట్లుగానే ఉండాలని అనుకునేవాడు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు నోరుజారడం, వాటి గురించి హోస్ట్ నాగార్జున క్లాస్ పీకడం కామన్ అయిపోయింది. కానీ ఈ వారం మాత్రం ఆరోగ్య సమస్యల వల్ల గేమ్స్ ఆడలేకపోయాడు. దీంతో ఓటింగ్ అంతా డ్రాప్ అయిపోయినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'ఓజీ' నుంచి నేహా శెట్టి సాంగ్ రిలీజ్)ఈ వారం మొత్తంగా ఆరుగురు నామినేషన్లలో నిలిచారు. సంజన, రీతూ, శ్రీజ, ఫ్లోరా, దివ్య, హరీశ్. వీళ్లలో సంజన, రీతూ, ఫ్లోరా.. తొలి వారం నుంచి అడపాదడపా నామినేషన్లలో ఉంటూ వచ్చారు. దీంతో వాళ్లకు ఓటు బ్యాంక్ బాగానే ఏర్పడింది. అలా ఈసారి కూడా ఓటింగ్ బాగానే పడింది. దివ్య కూడా వచ్చి వారమే అవుతుండటం, హౌసులో హుందాగా ప్రవర్తిస్తుండటం ఈమెకు ప్లస్ అవుతోంది. అది ఓట్ల రూపంలో మారుతోంది. చివరగా ఈసారి శ్రీజ కూడా కల్యాణ్‌కి సపోర్ట్ చేస్తూ బాగానే ఫెర్ఫార్మ్ చేసింది. దీంతో ఈమెకు కూడా ఓట్లు బాగానే పడ్డాయి. అమ్మాయిలందరూ ఆకట్టుకుంటే హరీశ్ మాత్రం ఆరోగ్య సమస్యలతో గేమ్స్ ఆడలేకపోయారు. అలా ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తోంది.ఆరోగ్య సమస్యనే మెయిన్ అయినప్పటికీ హరీశ్‌పై హౌసులోనూ నెగిటివిటీ బాగానే ఏర్పడినట్లు తెలుస్తోంది. తాజాగా శనివారానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా.. ఫ్లోరా-హరీశ్ ఫొటోల్లో ఒకరిది ఎంచుకుని ట్రాష్ చేయాలని నాగార్జున అడిగేసరికి చాలామంది హౌస్మేట్స్ హరీశ్ పేరు చెప్పారు. అలా ఈసారి హౌస్ నుంచి మాస్క్ మ్యాన్ని ఎలిమినేట్ చేసేశారట. అనధికారికంగా ఈ విషయం బయటకొచ్చింది. ఆదివారం ఎపిసోడ్‌తో హరీశ్ ఎలిమినేషన్‌పై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.(ఇదీ చదవండి: నన్ను 'లేడీ ప్రభాస్' అని పిలుస్తుంటారు: శ్రీనిధి శెట్టి) -
Bigg Boss 9: ప్రియ ఎలిమినేట్.. ఎంత సంపాదించిందంటే?
బిగ్‌బాస్ 9వ సీజన్లో మూడో ఎలిమినేషన్ జరిగింది. డాక్టర్ పాప ప్రియ బయటకొచ్చేసింది. మొత్తంగా ఆరుగురు సామాన్యుల్లో ఒకరిగా అడుగుపెట్టిన ఈమె.. ఎక్కువ వారాలు ఉంటుందని చాలామంది అనుకున్నారు. కానీ అనుహ్యంగా త్వరగానే ఔట్ అయిపోయి హౌస్‌ని వీడింది. మరి ప్రియ ఎలిమినేషన్‌కి కారణాలేంటి? రెమ్యునరేషన్ ఎంత సంపాదించింది?కర్నూలుకి చెందిన ప్రియ.. నటి కావాలని ఆశపడింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో డాక్టర్ అయింది. రీసెంట్గా ఈమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. దాని నుంచి తప్పించుకునేందుకు బిగ్‌బాస్‌లోకి రావాలనుకుంది. అలా అగ్నిపరీక్ష పోటీలో నెగ్గి ఐదో కామనర్‌గా హౌసులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే వచ్చింది అని మాటే గానీ ప్రతిదానికి మొదటి నుంచి ఓవరాక్షన్ చేయడం ఈమెకు చాలా మైనస్ అయిపోయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'వార్ 2'.. స్ట్రీమింగ్ డేట్ అదేనా?)అలానే ఇచ్చిన సంచాలక్ పనిని కూడా సక్రమంగా చేయలేదు. అక్కడొకటి జరిగితే ఆలోచించకుండా వెంటనే నిర్ణయం తీసేసుకోవడం లాంటి వాటి వల్ల ఈమెపై చాలా నెగిటివిటీ పెరిగిపోయింది. దీంతో ఈసారి ఆరుగురు నామినేట్ అయ్యారు. వీళ్లలో ఫ్లోరా.. ఇమ్యూనిటీ సాధించి సేవ్ అయిపోయింది. మిగిలిన వారిలో హరీశ్, రాము, రీతూ, కల్యాణ్, ప్రియ ఉండగా.. వీళ్లలో అతి తక్కువ ఓట్లు ప్రియకే పడ్డాయి. అంటే ప్రేక్షకుల్లో ఈమె పట్ల ఎక్కువగానే నెగిటివిటీ ఏర్పడింది. దీంతో మూడో వారం ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చేసింది.మూడు వారాల పాటు హౌసులో ప్రియ ఉంది. అయితే వారానికి రూ.70 వేల చొప్పున ఈమెకు అగ్రిమెంట్ మాట్లాడుకున్నారు. అలా మూడు వారాలకుగానూ రూ.2.10 లక్షల పారితోషికం ఈమె అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాను మరికొన్ని వారాల పాటు ఉంటానని అనుకున్నానని, కానీ ఇలా జరిగిపోవడం కాస్తంత బాధగానే ఉందని హౌస్ నుంచి వెళ్తూ వెళ్తూ నాగార్జునతో చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: నొప్పితోనే 'కాంతార 1' ఈవెంట్‌కు ఎన్టీఆర్) -
బిగ్‌బాస్ 9 నుంచి మరో కామనర్ ఎలిమినేట్!
ఈసారి బిగ్‌బాస్ మరీ బోర్ కొట్టించేస్తోంది. కామనర్స్ అంటూ హడావుడి చేసి ఏకంగా ఆరుగురిని హౌసులోకి తీసుకొచ్చారు. వీళ్లు గేమ్స్ ఆడటం, ఎంటర్టైన్ చేయడం కంటే నస పెట్టడం, ఆటిట్యూట్ చూపించడమే ఎక్కువైపోతోంది. ఈ క్రమంలోనే గత రెండు వారాల్లో శ్రష్ఠి వర్మ, మనీష్ ఎలిమినేట్ అయ్యారు. మూడో వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్‌తో పాటు చివరి నిమిషంలో లెక్కలు కూడా మారాయని తెలుస్తోంది. ఇంతకీ ఈసారి హౌస్ నుంచి ఎవరు బయటకొచ్చేశారు?వారమంతా అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. ఎలిమినేషన్ అంటే ప్రేక్షకులు బిగ్‌బాస్‌పై కాస్త ఆసక్తి చూపిస్తారు. అలా ఇప్పటికే శ్రష్ఠి, మనీష్ బయటకొచ్చేశారు. దీంతో ఈసారి ఎవరొస్తారా అనే అందరిలో టెన్షన్. ఇలాంటి టైంలో వైల్డ్ కార్డ్ అంటూ మరో కామనర్ దివ్య నిఖితని ఇప్పటికే హౌసులోకి పంపించారు. ఈమె బదులుగా ఎవరిని ఎలిమినేట్ చేయాలా అని అడగ్గా అందరూ సంజన పేరు చెప్పారు. దీంతో ఈమెని శనివారం ఎపిసోడ్‌లోనే స్టేజీపై తీసుకొచ్చేశారు. అయితే ఈమెని నిజంగానే ఎలిమినేట్ చేసేస్తారా? సీక్రెట్ రూంలోకి పంపిస్తారా అనేది ఈ రోజు తేలుతుంది.(ఇదీ చదవండి: సినిమా వాళ్లని జగన్ అవమానించలేదు: ఆర్. నారాయణమూర్తి)మరోవైపు ఈ వారం నామినేషన్లలో పవన్ కల్యాణ్, హరీశ్, ప్రియ, ఫ్లోరా సైనీ, రాము రాథోడ్, రీతూ చౌదరి ఉండగా.. వీళ్లలో ప్రస్తుతానికైతే రాము ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాతి స్థానంలో ఫ్లోరా సైనీ ఉందట. గత కొన్నిరోజులుగా హౌసులో కాంట్రవర్సీలకు కారణమవుతున్న రీతూ చౌదరి మూడో స్థానంలో ఉండగా.. చివరి మూడు స్థానాల్లో హరీశ్, కల్యాణ్, ప్రియ ఉన్నారట. అలా తక్కువ ఓట్లు పడిన ప్రియని ఈసారి ఎలిమినేట్ చేశారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సామాన్యుల నుంచి రెండో వికెట్ పడ్డట్లే. సీజన్ ప్రారంభంలో ఈమె కచ్చితంగా కొన్ని వారాలైనా ఉంటుందని అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఇంత త్వరగా ఎలిమినేషన్ అనేసరికి నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఈ సీజన్ మొదలైనప్పుడు ప్రియ కాస్తంత ఫాలోయింగ్తోనే హౌసులోకి వచ్చింది. కానీ తర్వాత ఏం చేయకుండా ముచ్చట్లు పెట్టడం, సెలబ్రిటీలపైన యాటిట్యూడ్ చూపించడం లాంటివి మాత్రమే చేస్తూ వచ్చింది. గతవారం సుమన్ శెట్టితో గొడవ లాంటివి కూడా ఈమెకు ఓ రకంగా మైనస్ అయినట్లు కనిపిస్తున్నాయి. ఇలా ఇన్నింటి వల్ల ఈసారి ప్రియకు తక్కువ ఓట్లు పడ్డాయని, ఫలితంగా ఎలిమినేట్ అయిందనే టాక్ వినిపిస్తుంది. ఆదివారం ఎపిసోడ్‌తో ఈసారి డబుల్ ఎలిమినేషనా లేదంటే ప్రియ ఒక్కతే హౌస్ నుంచి బయటకెళ్తుందా అనేది తేలుతుంది.(ఇదీ చదవండి: మనుషుల్ని తొక్కేస్తున్నాడు, ఇతడితో బతకలేం.. వైల్డ్ ఫైర్‌లా సంజనా) -
మిడ్ నైట్ ఎలిమినేషన్.. కార్నర్ చేసి పంపించారు!
-
బిగ్ బాస్ ను వదిలిన మర్యాద మనీష్
-
బిగ్‌బాస్ 9 రెండో ఎలిమినేషన్.. సామాన్యుడు ఔట్!
బిగ్‌బాస్ 9 హౌస్‌లో మరో వికెట్ డౌన్. గతవారం ఊహించని విధంగా కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ ఎలిమినేట్ అయింది. ఈసారి ఎవరు బయటకొస్తారా అని అందరూ పలు అంచనాలు వేశారు. అయితే కామనర్స్ (సామాన్యుల) నుంచి తొలి వికెట్ పడినట్లు తెలుస్తోంది. చివర్లో ఓటింగ్‌లో ట్విస్ట్ చోటుచేసుకోవడంతో ఆమె బదులు అతడు ఎలిమినేట్ అయ్యాడట. ఇంతకీ ఏంటి విషయం?తొలివారం అంతా గుడ్డు దొంగతనం లాంటి వాటితో అందరూ బోర్ కొట్టించారు. కానీ రెండో వారం వచ్చేసరికి హరీశ్ వల్ల హౌస్ అంతా హాట్ హాట్‌గానే ఉంది. మరోవైపు రీతూ చౌదరి లవ్ ట్రాక్ కోసం తెగ ప్రయత్నిస్తోంది. కానీ అదంతా స్క్రిప్టెడ్ అన్నట్లు అందరికీ తెలిసిపోతోంది. అలానే సామాన్యుల నుంచి డీమన్ పవన్ కెప్టెన్ అయితే అయ్యాడు కానీ వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున దాన్ని పీకేయబోతున్నారు.(ఇదీ చదవండి: రీతూ బండారం బట్టబయలు.. పవన్ కెప్టెన్సీ ఫసక్)అసలు విషయానికొస్తే ఈసారి ఎలిమినేషన్లలో మొత్తంగా ఏడుగురు ఉన్నారు. సుమన్ శెట్టి, భరణి, ఫ్లోరా సైనీ, హరీశ్, మనీష్, ప్రియ, పవన్. గతవారంలానే ఈసారి కూడా ఓటింగ్‌లో సుమన్ శెట్టి టాప్‌లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తర్వాత భరణి, పవన్, ఫ్లోరా సైనీలకు కూడా ఓట్లు బాగానే పడుతున్నాయి. దీంతో వాళ్లందరూ సుమన్ శెట్టి తర్వాత స్థానాల్లో ఉన్నారట. చివరి మూడు స్థానాల్లో హరీశ్, మనీష్, ప్రియ ఉన్నట్లు తెలిసింది.ఈ క్రమంలోనే ప్రియకు తక్కువగా ఓటింగ్ ఉండేసరికి కచ్చితంగా ఈమె ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ చివరి రోజైన శుక్రవారం రోజు ప్రియకు బాగానే ఓట్లు పడ్డాయని దీంతో మనీష్‌పై వేటు పడినట్లు తెలుస్తోంది. రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. సామాన్యుల్లో ఇతడు చివరగా వచ్చాడు. కానీ ఇప్పుడు వేగంగా ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చేశాడు!(ఇదీ చదవండి: 'ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు'.. టాక్ ఏంటి?) -
బిగ్ బాస్ లో సంచలన ఎలిమినేషన్..!
-
ఎలిమినేషన్లో ట్విస్ట్.. 'పుష్ప' కొరియోగ్రాఫర్ ఔట్!
మొన్ననే బిగ్‌బాస్ 9 మొదలైంది. అప్పుడే మొదటి వీకెండ్ వచ్చేసింది. వారాంతం వచ్చిందంటే హోస్ట్ నాగార్జున వచ్చేస్తాడు. నామినేట్ అయినవాళ్లలో కచ్చితంగా ఒకరిని ఎలిమినేట్ చేసేస్తారు. అయితే ఈసారి సెలబ్రిటీలుగా వచ్చిన వారిలో భరణి తప్పితే అందరూ నామినేషన్స్‌లో నిలిచారు. మరోవైపు సామాన్యుల నుంచి డీమాన్ పవన్ ఇందులో ఉన్నాడు. వీరిలో ఇద్దరు మాత్రం చివరి ప్లేసుల్లో నిలిచారు. ఇప్పుడు వారిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది తేలింది.ఈ వారం నామినేట్ అయినవాళ్లలో లక్స్ పాప ఫ్లోరా సైనీ.. బయటకొచ్చేస్తుందని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే సంజనతో గొడవ పడటం తప్పితే ఈమెకు పెద్దగా స్క్రీన్ స్పేస్ దొరకలేదు. అలా అని కెప్టెన్సీ టాస్క్‌లో ఏమైనా ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిందా అంటే అదీ లేదు. దీంతో ఈమెనే తొలివారం ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ 'పుష్ప' కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: మీదే తప్పు షో నుంచి వెళ్లిపోతా.. నాగార్జునకు మాస్క్ మ్యాన్ ఝలక్)బిగ్‌బాస్ హౌసులోకి శ్రష్ఠి వర్మ వస్తుందని రూమర్స్ వచ్చినప్పడు.. ఈమె కచ్చితంగా కొన్నివారాలైనా సరే ఉంటుంది. తన జీవితంలో జరిగిన వివాదం గురించి ఎప్పుడైనా మాట్లాడకపోదా అని అందరూ అనుకున్నారు. అలానే షో మొదలైన రోజు నాగార్జునతో మాట్లాడుతూ.. మనం కలిసి సినిమా చేయాలి సర్ అని అడిగింది. దీంతో త్వరగా బయటకొచ్చేయ్ అని నాగ్ సరదాగా అన్నాడు. మరి ఈ మాటల్ని సీరియస్‌గా తీసుకుందో ఏమో తొలివారమే ఈమెని ఎలిమినేట్ చేసినట్లు అనిపిస్తుంది.సాధారణంగా తొలివారం ఎలిమినేషన్ అనగానే సీనియర్ నటుల్ని బయటకు పంపిస్తూ ఉంటారు. ఈసారి మాత్రం అనుహ్యంగా యంగ్ బ్యూటీని ఔట్ చేయడం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు బిగ్‌బాస్ కూడా ఊహలకు అందని విధంగా చేస్తుంటాడు. మరి ఈసారి అసలేం జరిగింది? అనేది తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంతవరకు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: 'కూలీ'లో నటించి తప్పు చేశా.. ఆమిర్ అంత మాటన్నాడా?) -
Bigg Boss 8: ఈసారి ఆమె ఎలిమినేషన్ తప్పదేమో?
బిగ్‌బాస్ 8లో ప్రస్తుతం పదకొండో వారం నడుస్తోంది. ఈసారి గౌతమ్, నిఖిల్, యష్మీ, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, హరితేజ.. నామినేషన్స్‌లో ఉన్నారు. ఓవైపు హౌసులో మెగాచీఫ్ అయ్యేందుకు పోటీ నడుస్తోంది. ఇంతకీ మెగా చీఫ్ అయ్యిందెవరు? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశముంది?మొన్నటివరకు హౌసులో కన్నడ బ్యాచ్ హవా నడిచింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతిసారి నిఖిల్, ప్రేరణ, యష్మి, పృథ్వీలలో ఒకరో ఇద్దరో నామినేట్ అయ్యేవారు. దీంతో ఒకరి ఫ్యాన్స్ మరొకరిని సపోర్ట్ చేస్తూ గండం నుంచి తప్పించేవాళ్లు. ఈసారి అందరూ నామినేషన్స్‌లో ఉండేసరికి ఎవరి ఓట్లు వాళ్లకే పడుతున్నాయి. ఇది గౌతమ్‌కి కలిసొచ్చింది.(ఇదీ చదవండి: పృథ్వీనే కొట్టాలనుకున్న విష్ణు.. యష్మి ఎంత పని చేసింది?)ఈ వారం ఓటింగ్‌లో గౌతమ్.. టాప్‌లో కొనసాగుతున్నాడట. రెండో ప్లేసులో నిఖిల్ ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాత స్థానాల్లో వరసగా ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ ఉన్నారట. చివరి రెండు స్థానాల్లో అంటే డేంజర్ జోన్లో యష్మి, హరితేజ ఉన్నట్లు తెలుస్తోంది.గత రెండు వారాల నుంచి హరితేజ.. చివరి స్థానాల్లో ఉంటూ వస్తోంది. మెహబూబ్, నయని పావని ఎలిమినేట్ కావడంతో సేవ్ అవుతూ వచ్చింది. ఈసారి మాత్రం ఆ ఛాన్స్ లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చివర్లో ఉన్న విష్ణుప్రియ గానీ యష్మీ గానీ ఎలిమినేట్ కాకపోవచ్చు. దీంతో హరితేజపై వేటు పడటం గ్యారంటీ అనిపిస్తుంది. మరి ఇదే జరుగుతుందా? బిగ్‌బాస్ మరేదైనా ప్లాన్ వేశాడేమో చూడాలి?(ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్'కి పోటీగా 'ఇడ్లీ' సినిమా) -
హమాస్ చివరి కీలక నేత కసబ్ హతం
టెల్అవీవ్: హమాస్ ఉగ్రవాద సంస్థలో మిగిలిన చివరి కీలక నేతను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ(ఐడీఎఫ్) ప్రకటించింది. హమాస్ పొలిట్‌బ్యూరో సభ్యుడైన కసబ్‌ను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ వెల్లడించింది. గాజా స్ట్రిప్‌లోని ఇతర మిలిటెంట్ గ్రూపులను అతడు సమన్వయం చేస్తున్నాడని ఐడీఎఫ్ తెలిపింది. కారుపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో కసబ్ చనిపోయాడని హమాస్ వర్గాలు ధృవీకరించాయి. కాగా, ఇటీవలే ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 దాడుల సూత్రధారి సిన్వర్‌ను ఐడీఎఫ్ మట్టుబెట్టింది. అంతకుముందు హమాస్ చీఫ్‌గా ఉన్న ఇస్మాయిల్ హానియేను కూడా ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది. హమాస్‌ను లేకుండా చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఉగ్రవాద సంస్థలోని కీలక నేతల ఎలిమినేషన్‌పై ఐడీఎఫ్ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇజ్రాయెల్ హై అలర్ట్ -
కిర్రాక్ సీత ఎలిమినేటికి కారణాలు ఇవే..
-
'బిగ్‌బాస్' నుంచి మొదటి వారమే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వీరే (ఫోటోలు)


