బిగ్‌బాస్ షోలో వీకెండ్ వచ్చిందంటే చాలు హౌస్ట్ నాగార్జున వచ్చేస్తారు. కాస్త సందడి చేస్తారు. ఈసారి కూడా అలానే 'శివ' రీ రిలీజ్ ప్రమోషన్ సందర్భంగా డైరెక్టర్ ఆర్జీవీ, మూవీలో హీరోయిన్-నాగ్ భార్య అమల షోలో సందడి చేశారు. నాగ్-అమల స్టెప్పులు కూడా వేశారు. ఇవన్నీ సరే గానీ వీకెండ్ వస్తే కచ్చితంగా ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఈసారి బిగ్‌బాస్‌కి ఛాన్స్ ఇవ్వకుండా సెల్ఫ్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: సౌండ్‌తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)
9వ సీజన్‌లో ప్రస్తుతం తొమ్మిదో వారం నడుస్తోంది. ఈసారి సంజన, సుమన్ శెట్టి, భరణి, కల్యాణ్, రాము, సాయి శ్రీనివాస్, తనూజ నామినేషన్స్‌లో ఉన్నారు. సేవ్ చేసేందుకు ఓటింగ్ లైన్స్ శుక్రవారం రాత్రి వరకు ఉంటాయి. ఇది పూర్తయిన తర్వాత చివరి స్థానంలో సాయి శ్రీనివాస్ నిలిచినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వీకెండ్ ఇతడు బయటకెళ్లిపోవడం గ్యారంటీ అని అంతా ఫిక్సయ్యారు. సరిగ్గా ఇలాంటి టైంలో ట్విస్ట్. గత కొన్నాళ్ల నుంచి డల్‌గా ఉన్న రాము.. సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
ఐదోవారం వరకు రాము రాథోడ్ బాగానే బండి లాక్కొచ్చాడు గానీ తర్వాత మాత్రం పూర్తిగా డల్ అయిపోయాడు. నామినేషన్స్‌లో వాదించట్లేదు, పైపెచ్చు తానే నామినేట్ అవుతానని అంటున్నాడు. మరోవైపు గేమ్స్ వేటిలోనూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంట్లో వాళ్లు గుర్తొస్తున్నారని పదే పదే అంటున్నాడు. శనివారం ఎపిసోడ్‌లోనూ హౌస్ట్ నాగార్జున ఇదే విషయం అడిగారు. దీంతో తనదైన స్టైల్లో పాటపడి తనకు ఇంట్లోవాళ్లు గుర్తొస్తున్నారని చెప్పకనే చెప్పాడు. 'బాధయితోందే యాదిలో మనసంతా.. మస్తు బరువైతోందే అమ్మ యాదిలో మనసంతా' అంటూ ఎమోషనల్ అయ్యాడు.
(ఇదీ చదవండి: విజయ్ చివరి సినిమా.. 'తళపతి కచేరీ' సాంగ్ రిలీజ్)
'చిన్నప్పుడే మా అమ్మనాన్న పనికోసం వేరే ఊరికి వెళ్లిపోయారు. అలా 5-6 ఏళ్లు దూరంగా ఉన్నా. ఇప్పుడు లైఫ్ అంతా సెట్ అయింది. ఇక వాళ్లని చూసుకుందాం అనే టైంలో ఇన్నిరోజులు దూరంగా ఉన్నాను' అని రాము అన్నాడు. దీంతో బిగ్‌బాస్ గేట్స్ ఓపెన్ చేయండి అని నాగ్ చెప్పడంతో తలుపులు తెరుచుకున్నాయి. మరి వెళ్తావా లేదా తేల్చుకో అని నాగ్ అడగడంతో.. 'వెళ్తాను సర్' అని రాము దీనంగా చెప్పాడు. ప్రోమోలో డ్రామా చూపించినప్పటికీ నిజంగానే రాము బయటకొచ్చేశాడట. శనివారం ఎపిసోడ్‌లోనే ఈ సెల్ఫ్ ఎలిమినేషన్ ఉండబోతుంది.
ప్రతివారం ఒకే ఎలిమినేషన్ ఉంటుందిగా. రాము సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోవడంతో రెగ్యులర్‌గా జరగాల్సిన ఉంటుందా లేదా అందరూ అనుకుంటున్నారు. అయితే సాయి శ్రీనివాస్‌ని కూడా పంపిస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చాలావరకు అయితే రాము మాత్రమే హౌస్ నుంచి బయటకు రావొచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?
(ఇదీ చదవండి: చెల్లి సీమంతం గ్రాండ్‌గా చేసిన బిగ్ బాస్ వితిక)


