కమెడియన్ భారతీ సింగ్ ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. తను ఇంట్లో ఉన్న సమయంలో సడన్‌గా ఉమ్మునీరు లీకైంది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తన బాబును తొలిసారి తన చేతుల్లోకి తీసుకున్న మధుర క్షణాల గురించి మాట్లాడుతూ యూట్యూబ్‌లో ఓ వీడియో షేర్ చేసింది.
దూరంగా ఉంచారు
బాబు పుట్టిన వెంటనే నా నుంచి దూరంగా తీసుకెళ్లారు. పరీక్షలని, అబ్జర్వేషన్‌లో ఉంచాలని ఏవేవో కారణాలు చెప్పారు. కానీ వాడిని నాకు దూరంగా ఉంచడం తట్టుకోలేకపోయాను. రెండు రోజుల తర్వాత బాబును నా చేతికందించారు. తొలిసారి వాడిని ఎత్తుకున్నప్పుడు సంతోషంతో ఏడ్చేశాను.
ఎవరి దిష్టి తగలకూడదు
గోలాలాగే వీడు కూడా చాలా అందంగా, ఆరోగ్యంగా ఉన్నాడు అంది. బాబును ముద్దుగా కాజు అని పిల్చుకుంటోంది. ఈ వీడియో కింద అభిమానులు.. మీ పిల్లలు కాజు, గోలా.. ఇద్దరికీ ఎవరి దిష్టి తగలకూడదు అని కామెంట్లు చేస్తున్నారు. కమెడియన్ భారతీ సింగ్.. యాంకర్, నిర్మాత హార్ష్ లింబాచియాను 2017లో పెళ్లి చేసుకుంది. వీరికి 2022లో బాబు లక్ష్ పుట్టాడు. ఇతడిని ముద్దుగా గోలా అని పిల్చుకుంటారు.


