ఫహద్ ఫాజిల్.. మలయాళంలో అనేక సినిమాలు చేసిన ఈ హీరో పుష్ప సినిమాతో తెలుగువారికి సుపరిచితుడయ్యాడు. ఈ మలయాళ స్టార్ ప్రస్తుతం సొంత భాషతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఇతడు తమిళ దర్శకనటుడు పార్తీబన్‌తో సెల్ఫీ దిగాడు.
ఫహద్ తెలుసా?
ఈ ఫోటోను పార్తీబన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. నేను ఫాజిల్ సర్‌ను కలిశాను. ఈ సందర్భంగా ఆయన తన కొడుకు ఫహద్ ఫాజిల్‌ను నాకు పరిచయం చేశాడు. ఫహద్ నాకు తెలుసా? అని అమాయకంగా అడిగారు. ఫహద్ ఇప్పుడు ప్రపంచంలోనే ఫేమస్ యాక్టర్. నాకు తెలియకుండా ఉంటుందా? తనను కలిసినప్పుడు నాకో విషయం అర్థమైంది.
మగవాళ్లను సైతం ఆకర్షించే తత్వం..
ఫహద్ మంచి వ్యక్తి.. చాలా ఇంట్రస్టింగ్ పర్సన్. అతడి మాటలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే! ఆడవాళ్లనే కాదు, మగవాళ్లను సైతం ఆకర్షించే శక్తి అతడిలో ఉంది.. మనం మళ్లీ కలుద్దాం అని పోస్ట్ కింద రాసుకొచ్చాడు. పార్తీబన్ తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేశాడు. చివరగా ఇడ్లీ కడై (తెలుగులో ఇడ్లీ కొట్టు) సినిమాలో కనిపించాడు.


