రాజాసాబ్‌లో డూప్‌? క్లారిటీ ఇచ్చిన మాళవిక | Malavika Mohanan Reacts on Her Dupe in The Raja Saab Movie | Sakshi
Sakshi News home page

Malavika Mohanan: రాజాసాబ్‌లో డూప్‌ అంటూ ట్రోలింగ్‌.. స్పందించిన హీరోయిన్‌

Feb 14 2026 11:06 AM | Updated on Feb 14 2026 11:16 AM

Malavika Mohanan Reacts on Her Dupe in The Raja Saab Movie

ప్రభాస్‌- మారుతి కాంబినేషన్‌లో 'ది రాజాసాబ్‌' సినిమా ప్రకటించినప్పటి నుంచి విమర్శలు వెంటాడుతూనే ఉన్నాయి. తీరా సినిమా రిలీజయ్యాక కూడా ట్రోలింగ్స్‌ మరింత పెరిగాయే తప్ప ఆగలేవు. ముఖ్యంగా ప్రభాస్‌కు చాలాచోట్ల డూప్‌ ఉపయోగించడంపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఓ ఫైట్‌ సీన్‌ కోసం హీరోయిన్‌ మాళవిక మోహనన్‌కు కూడా డూప్‌ ఉపయోగించడంతో తనను కూడా ట్రోల్‌ చేశారు.

ట్రోలింగ్‌పై స్పందించిన హీరోయిన్‌
తాజాగా ఈ వివాదంపై మాళవిక మోహనన్‌ స్పందించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ ట్వీట్‌ చేసింది. ది రాజాసాబ్‌ సినిమాలో నేనే స్వతాహాగా స్టంట్స్‌ చేశానని చెప్పుకున్నాను. అయితే నా బాడీ డబుల్‌ (డూప్‌) యాక్షన్‌ సీన్‌లో ఉన్నట్లుగా ఓ ఫోటో వైరలవుతోంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి స్టంట్‌ ఆర్టిస్ట్‌.. అలాగే నా డూప్‌ కూడా!

చిన్నతనం నుంచే..
ముందుగా నేను చెప్పొచ్చేదేంటంటే.. నాకు యాక్షన్‌ అంటే ఇష్టం. ఫైట్‌ సన్నివేశాల్లో పాల్గొనడాన్ని ఆస్వాదిస్తాను. చిన్నతనం నుంచే నేను స్పోర్టివ్‌ అమ్మాయిని. కొత్త విషయాలు నేర్చుకోవడం, శరీరాన్ని ఛాలెంజ్‌ చేయడం అంటే చాలా ఇష్టం. రెండో విషయం.. సెట్‌లో ఎప్పుడూ స్టంట్‌ డబుల్స్‌ సిద్ధంగా ఉంటారు. నటీనటులు సొంతంగా యాక్షన్‌ సీన్స్‌ చేసినా సరే వారు అందుబాటులోనే ఉంటారు.

రిస్కీ షాట్స్‌ మాత్రం..
వారు అనుభవజ్ఞులు కాబట్టి.. యాక్షన్‌ డైరెక్టర్‌ వారిని ఫైట్‌ రిహార్సల్స్‌ చేయమని చెప్తాడు. ఫైనల్‌ షాట్‌ మాత్రం మాపై చిత్రీకరిస్తారు. అయితే కొన్ని సన్నివేశాలు చాలా ప్రమాదకరం అని భావించినప్పుడు నటులకు బదులుగా స్టంట్‌ డబుల్‌ను సీన్‌ పూర్తిచేయమని అడుగుతారు. ఎందుకంటే ప్రొఫెషనల్స్‌ అయితే ఏ సమస్యా లేకుండా వాటిని ఈజీగా చేయగలరు.

వివరణ అక్కర్లేదు
ఫైనల్‌గా.. నేను ఫైట్‌ సీన్స్‌ సమర్థవంతంగా చేసేందుకు నా స్టంట్‌ డబుల్‌ ఎంతగానో తోడ్పడింది అంటూ వీడియోలు షేర్‌ చేసింది. ఒక్క ట్వీట్‌ ద్వారా యాక్షన్‌ సీన్స్‌ తానే చేసినట్లు క్లారిటీ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు నువ్వు టాలెంటెడ్‌ అని మాకు తెలుసు.. నువ్వు ఎలాంటి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. ప్రస్తుతం రాజాసాబ్‌ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

 

 

చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి

Advertisement
 
Advertisement
Advertisement